క్యాంపు కార్యాలయంలో ఉద్యోగ సంఘాలతో ఏపీ ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి మీటింగ్ నిర్వహించి పలు సూచనలు చేసారు. ఆ తర్వాత సజ్జల మీడియాతో మాట్లాడుతూ... ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వ పాలన పరమైన అంశాల్లో సహకరిస్తున్నారు అని అన్నారు. గత ప్రభుత్వాలు ఉద్యోగులను స్వలాభం కోసం వాడుకొని వదిలేసాయి అని ఆరోపించారు. విధుల్లో ఉద్యోగుల కొరత ఉండి సమస్యలు ఉన్న చోట అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను నియమించాం అని అన్నారు.

కోవిడ్ దృష్ట్యా ఉద్యోగుల సమస్యలు పెండింగ్లో ఉన్నాయి అని తెలిపారు. ఆర్ధిక పరమైన ఇబ్బందులు ఉన్నాయి ఉద్యోగులు కూడా అర్థం చేసుకున్నారు అని అన్నారు. సిపియస్,డీఏ,పీఆర్సీ,అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నాం అని తెలిపారు. ఈనెలాఖరు లోగా పీఆర్సీని క్లియర్ చేస్తాం అని అధికారంలోకి అడగకుండానే ఐఆర్ ఇచ్చాము అన్నారు. ఉద్యోగులను విడగొట్టి నడపాలనేది   ప్రభుత్వ ఉద్దేశ్యం కాదు అని స్పష్టం చేసారు. ఉద్యోగులు అంతా పాలన పరమైన అంశంలో కీ రోల్ పోషిస్తున్నారు అన్నారు.

సాలరీలు, పెన్షన్ల విషయంలో  ఇకపై డిలే లేకుండా చర్యలు తీసుకుంటాం అని వెల్లడించారు. తమ పాలన విషయంలో ఉద్యోగులు అందిస్తున్న సహకారాన్ని సీఎం  జగన్ మర్చిపోరు అని ప్రత్యేకంగా ఎవరిని మేము ఆహ్వానించలేదు అని పేర్కొన్నారు. రెండు ఉద్యోగ సంఘాలు నిన్న మెమరెండం ఇవ్వడంతో వారూ వచ్చి ఈ రోజు కలిశారు అని అన్నారు. మిగిలిన సంఘాలతో కూడా త్వరలోనే భేటీ అవుతాం అని తెలిపారు. సీఎస్ నేతృత్వంలో జరిగే సమావేశంలో అన్ని సంఘాలకు ఆహ్వానం ఉంటుంది అని అన్నారు. అన్ని సంఘాలు కలిస్తే బాగుంటుందనేది ప్రభుత్వ ఆలోచన అని అన్నారు. సంఘాలు వర్గాలుగా గ్రూపులుగా ఉండకూడదనేది ప్రభుత్వం  ఆలోచన అంటూ స్పష్టం చేసారు. ఉద్యోగుల బయట వ్యక్తులు కాదు వారంతా ప్రభుత్వంలో భాగమే అన్నారు సజ్జల. ఉద్యోగ సంఘాల నేతలకు నేను ఫోన్ చేసింది వాస్తవమే అని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ap