గులాబ్ తుఫాను ధాటికి పంట‌లు పోయిన రైతుల‌కు సాయం అంద‌నే లేదు. త‌క్ష‌ణ సాయం ఇస్తామ‌న్న ప్ర‌భుత్వం ముఖం చాటేసింది. ప్రాథ‌మిక నివేదిక‌లు అన్నీ త‌ప్పులు త‌డక‌లుగానే ఉన్నాయి. పంట న‌ష్టం అంచ‌నాల్లో అధికారులు తాము నిబంధ‌న‌ల‌ను పాటించి, వీటిని రూపొందించామ‌ని చెబుతుంటే అదేమీ లేద‌ని కొన్ని  మండ‌లాల్లో క‌ళ్లెదుటే పంట‌పోయినా అధికారులు వాటిని గుర్తించి న‌మోదు చేయ‌కుండా నిబంధ‌న‌ల పేరిట దాట‌వేత ధోర‌ణిలో వెళ్లిపోయార‌ని రైతులు ఆరోపిస్తున్నారు.

పంట న‌ష్టాలు తీవ్రంగా ఉన్నా అధికారులు ప‌ట్టించుకోరు. శ్రీ‌కాకుళం జిల్లాలో గులాబ్ తుఫాను నేల వాలిన పంట‌ల‌కు న‌ష్ట‌ప‌రిహా రం ఇస్తామ‌ని చెప్పిన సీఎం జ‌గ‌న్ ఇప్పుడు ఆ ఊసే మ‌రిచిపోయారు అన్న విమ‌ర్శ‌ను ఎదుర్కొంటున్నారు. కొన్ని చోట్ల చుట్టు ప‌క్క‌ల ఉన్న వాగులువంక‌లు పొంగి పొర‌లి పంట పొలాల‌ను నీట ముంచాయి. అయినా కూడా అధికారులు అవేవీ ప‌ట్టిన విధంగా ఉంటున్నార‌ని ప్ర‌ధాన మీడియాలో క‌థ‌నాలు స్ప‌ష్టం చేస్తున్నా సంబంధిత వ‌ర్గాల నుంచి స్పంద‌న‌లేదు. వ‌ర్షాల‌కు సువ‌ర్ణ ముఖి, వేగావ‌తి న‌దులు పొంగి పొరలి పంట‌ను నీట ముంచితే దీనిని ఎండుటాకు తెగులుగా గుర్తించి త‌మ‌ను ఆదుకోలేద‌ని రైతులంతా వాపోతున్నారు.

తీవ్ర తుఫానుల‌తో అత‌లాకుత‌లం అవుతున్న సిక్కోలుకు గులాబ్ గండం తీవ్ర స్థాయిలో క‌దిపికుదిపేసింది. చాలా పంట‌లు న‌ష్ట‌పో యారు రైతులు. వ‌రి, అర‌టి, జీడి, మొక్క‌జొన్న‌ పంట‌ల‌కు విప‌రీతం అయిన న‌ష్టం వాటిల్లింది. పంట న‌ష్టాల అంచ‌నాల‌కు అధికారు లు బ‌య‌లు దేరి, నివేదిక‌లు రూపొంచించారు. కానీ వీటిపైనే ఇప్పుడు ప‌లు అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి. జ‌రిగిన పంట న‌ష్టానికి, రూ పొందించిన నివేదిక‌లకు అస్స‌లు సంబంధ‌మే లేద‌ని రైతులు వాపోతున్నారు. త‌మ క‌ష్టాలు తెలుసుకుని సాయం చేస్తార‌నుకున్న రైతులంతా నివేదికల రూప‌క‌ల్ప‌న‌లో పార‌ద‌ర్శ‌క‌త లేద‌ని గ‌గ్గోలు పెడుతున్నారు. కొన్ని మండ‌లాల్లో అస్స‌లు పంట న‌ష్ట‌మే లేద‌ని తేల్చేశారు. భారీ వ‌ర్షాల‌కు పంట నీట మునిగి రైతులు క‌న్నీరుమున్నీరు అవుతుంటే అవేవీ ప‌ట్ట‌ని విధంగానే అధికారులు అత్యంత నిర్లక్ష్యంతో నివేదికలు రూపొందించారు. నివేదిక‌ల్లో పంట న‌ష్టం వివ‌రాల‌ను త‌గ్గించి చూపారు. కొన్ని ప్రాంతా లలో తీవ్ర పంట న‌ష్టం వాటిల్లినా వాటికీ నివేదిక‌ల్లో చోటే లేదు. ఇక ప‌రిహారం సంగ‌తి తాము మ‌రిచిపోవాల్సిందేన‌ని రైతులు ఆవేద న చెందుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ycp