యాసంగిలో వరి పంట వేయాలా.. వ‌ద్దా..? అనే  గందరగోళ పరిస్థితి నెలకొని ఉంది. ఇప్పటికే  మార్కెట్‌ల‌కు చేరిన పంట‌, క‌ల్లాలు, రోడ్ల‌పై ఉన్న పంట కొనుగోలు చేయ‌డంలో ఆల‌స్యం జ‌రుగుతుంద‌ని రైతులు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. మ‌రోవైపు రాష్ట్ర, కేంద్ర ప్ర‌భుత్వాల మ‌ధ్య మాట‌ల యుద్ధం జ‌రుగుతూనే ఉంది. ఈ త‌రుణంలోనే కేంద్రం యాసంగిలో వ‌రి వేయ‌వ‌ద్ద‌ని స్ప‌ష్టం చేసి చెప్పింది.   ఇదిలా ఉంటే ఇవాళ హైద‌రాబాద్‌లో వ‌రి కొనుగోలు చేయాల‌ని తెలంగాణ‌లో ప్ర‌తిప‌క్ష‌మైన కాంగ్రెస్ కూడా  ధ‌ర్నా చేప‌ట్టింది.

తాజాగా తెలంగాణ ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సోమేశ్ కుమార్ యాసంగిలో వ‌రి సాగు చేయ‌వ‌ద్ద‌ని రైతుల‌కు సూచ‌న‌లు చేసారు. పారాబాయిల్డ్ బియ్యం తీసుకోవద్దు అని కేంద్ర ప్ర‌భుత్వం, ఫుడ్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా నిర్ణ‌యించాయ‌ని వెల్ల‌డించారు. రాష్ట్రంలో యాసంగి వ‌రి పారాబాయిల్డ్ బియ్యానికి అనుకూలంగా ఉన్నాయ‌ని.. అందుకే రైతులు వ‌రి సాగు చేయొద్ద‌ని సూచించారు సీఎస్‌. అయితే శ‌నివారం తెలంగాణ పౌర స‌ర‌ఫ‌రాల శాఖ అధికారుల‌తో సీఎం సోమేశ్‌కుమార్ సమీక్ష నిర్వ‌హించారు.

 సీఎస్ నిర్వ‌హించిన  ఈ స‌మావేశానికి అన్ని జిల్లాల క‌లెక్ట‌ర్లు, సీపీలు, ఎస్పీలు, వ్య‌వ‌సాయ శాఖ అధికారులతో  హాజ‌రు అయ్యారు.  ధాన్యం కొనుగోళ్లు, యాసంగి సాగు, అధికారుల‌తో స‌మీక్షించారు సీఎస్‌. ఫారాబాయిల్డ్ రైస్ తీసుకొవ‌ద్దు అని కేంద్రం, ఎఫ్‌సీఐ నిర్ణ‌యం తీసుకున్నాయ‌ని గుర్తు చేసారు. రైతులు ర‌బీ సీజ‌న్‌లో వ‌రిసాగు చేయొద్దంటూ సూచ‌న‌లను కూడా  సూచించారు. విత్త‌న కంపెనీలు, మిల్ల‌ర్ల‌తో ఒప్పందాలు ఉన్న రైతులు వ‌రిసాగు చేయ‌వ‌చ్చు అని వెల్ల‌డించారు సీఎస్‌. ప్ర‌స్తుతం కేంద్రం 40ల‌క్ష‌ల ట‌న్నుల బియ్యం మాత్రమే కొన‌నున్నట్టు కేంద్రం చెప్పింద‌ని.. ధాన్యం కొనుగోలు సాఫీగా కొన‌సాగేవిధంగా అధికారులు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని తెలిపారు. అదేవిధంగా వానా కాలం పంటను కొనేందుకు అవ‌స‌ర‌మైన ప్రాంతాల‌లో నూతంగా కొనుగోలు కేంద్రాల‌ను ఏర్పాటు చేయాల‌ని సీఎస్ అధికారుల‌ను ఆదేశించారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: