ప్రపంచంలో ఎక్కడ లేని లౌకికత్వం తమ దేశంలోనే ఉందని పాక్ ప్రధాని ఇమ్రాన్ అంటున్నాడు. అక్కడ ప్రజలు అంత సుఖంగా, స్వేచ్ఛగా ఉంటున్నారని ఆయన అర్ధం. అక్కడ ప్రజలు ఎంత గొప్పగా బ్రతుకుతున్నది ప్రపంచానికే తెలుసు, గత రెండు రోజుల క్రితమే స్వయంగా ఇమ్రాన్ ప్రపంచానికి తమ దేశాన్ని నడపడానికి కూడా ఆర్థికవనరులు లేవని వాపోయాడు. అటువంటి ఆయన నేడు కొత్తగా మాట మారుస్తూ తమ దేశం గొప్పదని చెప్పుకుంటున్నాడు. ఇది ప్రపంచానికి ఎంత చోద్యంగా అనిపిస్తుందో ఆయనకు తెలియనిది కాదు కానీ, ప్రస్తుతం ఆయనకు ఏ దిక్కు లేదు కాబట్టి ఎవరు ఎలా ఆడమని చెపితే అలా ఆడక తప్పదు. మొన్న దేశం దివాళా తీసింది అని ఎవరో చెప్పామన్నారు కాబట్టి మీడియా ముందుకు వచ్చి చెప్పాడు, నేడు దేశం గొప్పదనే విషయం కూడా ఎవరో చెప్పమంటే చెపుతున్నాడు అంతకంటే ఏమి చేయలేదు.

అసలే పదవికి గండంగా ఉంది, దేశం ఆర్థికంగా చితికిపోయింది. అనుకున్నవన్నీ బెడిసికొడుతున్నాయి. దీనితో ఏమి చేయాలో తెలియక ఇలా ఎవరో చదవమని ఇచ్చిన స్క్రిప్ట్ చదివేస్తున్నాడు. పాక్ లో ఉన్నవారే ఎటైనా వెళ్ళిపోయి ప్రాణాలు కాపాడుకుందాం లేదా స్వేచ్ఛగా బ్రతికేద్దాం అనుకుంటున్నారు. అలాంటి దేశంలో కి ఇతర దేశాలను స్వాగతించడం అంటే అది ఎంత ఆశ్చర్యకరమో ఇమ్రాన్ కు మాత్రం తెలియదు. వాళ్ళ దేశం వాళ్లకు ముద్దు కావచ్చు, కానీ అది ఎంత ఘోరంగా ఉందని తెలిసినప్పటికీ ఇతర దేశాలను స్వాగతించడం అనేది ఉంది చూశారు అదే పెద్ద ఘనకార్యం. అది ఇమ్రాన్ చేశారు కాబట్టి గొప్ప నేత అనుకోవాల్సిందే.

కేవలం తమ దేశంలో ఏడేళ్లు ఉంటె పౌరసత్వం ఇచ్చేస్తాం అంటూ తాజాగా ఇమ్రాన్ చెప్పడం చాలా హాస్యాస్పదంగా అనిపించి ఉండొచ్చు ప్రపంచానికి. కారణం కూడా తెలిసిందే. ప్రపంచం అంతా వెలిసిన దేశంగా ఉన్న ఆ దేశానికీ వెళ్లే వాళ్ళు ఉంటారా అంటే నమ్మడం కష్టమే. కాకపోతే ఎవరైనా అక్కడకు పర్యాటకులుగా వెళ్లడం అనేది కాస్త నమ్మదగ్గ విషయం. ఇప్పటి పరిస్థితులలో ఎవరిపైన ఆఫ్ఘన్ వెళ్లి స్థిరపడాలని భావిస్తారా, మరి అదేస్థితిలో ఉన్న పాక్ కు మాత్రం ఎవరైనా ఎందుకు వెళతారు. ఈ మాత్రం అర్ధం చేసుకోలేకపోతున్నాడా ఇమ్రాన్ ఖాన్. బహుశా వాళ్ళ మతస్తులను స్వాగతించారు అనుకుందాం అంటే, వాళ్ళ దేశం నుండి పారిపోతున్న వాళ్లలో ఎక్కువగా ఉన్నవారు ఇస్లాం మతస్తులే. అది అక్కడ తమవారికి కూడా ఉన్న గౌరవం. ప్రపంచంలో గొప్ప గొప్ప నేతలు ఎందరో ఉండొచ్చు గాక, ఇలాంటి ప్రకటనలు చేసిన వారు బహు కొద్దిగా ఉండొచ్చు, ఆ ఘనత ఇమ్రాన్ కు దక్కింది. ఇది మాత్రం ఘనతే.

మరింత సమాచారం తెలుసుకోండి: