ఒక కాలేజీకి పోవాలి నేను..పాఠాలు చెప్పిన మాస్టారి ద‌గ్గ‌ర నుంచి అనుమ‌తి పొంది నేను కొన్ని మాట‌లు చెప్పాలి. భార‌తీయ‌త ఔన్న‌త్యం వాటి గురించి కొంద‌రు చెప్పి న‌వి విన్నాక నాకు కొన్ని స్ఫుర‌ణ‌కు తూగాయి. స్మ‌ర‌ణ‌కు వ‌చ్చాయి. ఏం రాసినా లోప‌లి మ‌నిషి ఆనందంగా ఉండాలి. వాడి ఆదేశానుసారం ప్ర‌యాణించాలి. స‌న్ డిగ్రీ కాలేజీ (శ్రీ‌కాకుళం న‌గ‌రం)లో సిరివెన్నెల స్మృతిలో...మంచి విద్యార్థిని నేను కాను.. ఆ మాట‌కు వ‌స్తే చెడ్డ విద్యార్థినీ కాదు..మంచి కొంచెం ఎక్కువ ఉంటే అందుకు కార‌ణం అమ్మ అయి ఉండ‌వ‌చ్చు..అప్ప‌టికీ నా కాలేజీ గొడ‌ వ‌లు తెలిసిన అమ్మ‌కు నేను మంచి.. కొంద‌రికి చెడ్డ కావొచ్చు.. ఇప్పుడంటే చ‌దువు ఇష్టం అప్పుడు కూడా ! కానీ చెప్పేవాడు బాగుండ‌క పోతే వ‌చ్చే విసుగు కోపం ఆవే శం ఇవ‌న్నీ నాలో మిక్కిలి ఎక్కువ ఉండేవి. ఇప్పు డు చెబుతున్న వాడు నేను.. ఇం త‌కుముందు చెప్పి వెళ్లిన‌వాడు సిరివెన్నెల. డు కాదు రు.. అవును..రు! రు ఇక్క‌డ రూలింగ్.ప్రాగ్దిశ వీణియ..వింటూ ఉంటే కొన్ని క‌ల‌హాలు గుర్తుకువ‌చ్చాయి..క‌ల‌వ‌రింత‌లూ ఉన్నాయి..దిక్క‌ని మొక్కిన చోట ప్రాణ హ‌రుడి విలాపాన్ని విన్నారు.. హ‌రించేది ఏది..ద‌హించేది ఏది.. చితి మంట‌లు హ‌రిస్తాయా ద‌హిస్తాయా..దావాన‌ల వ్యాప్తిని ఏమ‌నాలి.. ఓ కుర్రాడు చెప్పిన విధంగా గూగుల్ చేయాలా? హా!హా!కాలేజీలు, విద్యాల‌య ప్రాంగ‌ణాలు విలువల పాటింపులో ఉంటే తాత్విక‌త‌ను తెలుసుకోవాలి. అంటే సిరివెన్నెల చెప్పిన విధంగా చేసే ప‌నిని అర్థం చేసుకోవ‌డం లేదు అర్థం తెలుసుకుని ఒక ప‌నిని చేయ‌డం.. ప్రేమించ‌డం అన్న పెద్ద ప‌దం మ‌నుషుల‌కు అన్వ యించి చూస్తే కొంద‌రే ఆ ప‌దం ద‌గ్గ‌ర విజేత‌లు.. ఆలోచ‌న‌లు అన్న‌వి ఆక‌ర్ష‌ణ‌లు.. అభిప్రాయాలు అన్న‌వి అభిఘాతాలు అని అంటాను నేను.. అవును! రంగులు ఎలానో ఈ జీవితం కూడా కొన్ని వివ‌ర్ణ స‌ముదాయాల‌ను ప్రేమిం చాలి.. చావు నొప్పి..బ‌తుకు నొ ప్పి అని చెప్ప‌డంలో అర్థం వెతికి ..ప్ర‌తి నిమిషాన్ని ఆ ప‌రంప‌ర‌కు ద‌గ్గ‌ర చేసిన వారిని సంద‌ర్భాన్నీ ప్రేమించాలి.. అవును!అమ్మ బతుకు ఇచ్చింది..నాన్న ఆయ‌న‌కు ధాతు మంజరి (సంస్కృతాన‌) నేర్పాడు.. యోగి నాన్న.. అమ్మ సాధ్వి.. అంత‌టి త‌ల్లిదండ్రుల బిడ్డ‌లు సీతారాముడు మ‌రియు ఇంకొంద‌రు..హైద్రాబాద్, ఎల్లారెడ్డి గూడ‌లో శాస్త్రి ఎలా ఉంటారు అని చాలా మంది వాక‌బు చేశారు. ఇప్పుడు శాస్త్రి యోగ స‌మాధిలో ఉన్నారు క‌నుక ఏమీ అనకూడ‌దు.. త‌పస్సు చెడ‌గొ డితే పాపం.. అలాంటి పాపం ప‌నులు చేయ‌ను నేను.. బ‌డికి పోయిన ప్ర‌తి సంద‌ర్భం లో నూ ఈ గాలి ఈ నేల న‌ను క‌న్న నా వాళ్ల ఆనవాళ్లు..ఇవే క‌నిపిస్తాయి.. అమ్మ ఓ టీచ‌రు క‌నుక.. ఎంత గొప్ప‌గా ఆ బ‌డి ప్రాంగ‌ణం ఉంటే అంత సంతోషం.. మాస్టారు కామేశ్ మాస్టారు.. మాస్టారు ముర‌ళీ కృష్ణ మాస్టారు.. మాస్టారు బ‌యాల‌జీ మాస్టారు.. గ‌ణేశ్ మాస్టారు..మాస్టారు తెలుగు చెప్పే భ‌వానీ ప్ర‌సాద్ మాస్టారు.. మాస్టారు లెక్కల మాస్టారు ర‌మేశ్ మాస్టారు.. ఇంద‌రెంద‌రో ఉన్నా రు.. ఆ కాలేజీలో.. వీళ్లంతా బిడ్డల బాగు కోసం మంచి సాహిత్యం విస్తృతి కోసం ఉన్నారు.. నాతో ఉన్నారు..నాలో ఉన్నారు..నేను కొన్నిక‌ల‌ల‌ను అప్ప‌గించి వ‌చ్చాను స‌ర్ అవి త‌ప్ప‌క నిజం అయి తీరుతాయి.. బిడ్డ‌ల‌కు ఆధునిక వ‌చ‌న వైశిష్ట్యం నేర్పాను.. రీతి చెప్పాను.. ఆ రీతి గౌళే ఈ మార్నింగ్ రాగా.. ర‌స సిద్ధి అని ఒక‌టి ఉంటుంది.. అది ఎవ్వ‌ర‌యినా సాధించా ల్సిందే అని అంటారు సి రివెన్నెల.. అవును! సాధించాల్సినంత సాధించేక ఏం సాధిం చాలి.. ఉద్దేశం ఏంటి లక్ష్యం ఏంటి అని న‌న్ను ఎవ్వ‌ర‌డిగినా న‌వ్వుతా ను.. ఏమీ ఉండొద్దు..చెబుతున్న‌వ‌న్నీ నిర్ణాయ‌క శ‌క్తిగా మారాక, నిర్థార‌ణ‌కు తూగాక ధాతువు మ‌ట్టిలో ఉండదు..మ‌నిషిలో ఉంటుంది..మ‌న‌సులో దాగి గొప్ప తోవ ను చూపిస్తుంది. ధాతు వు అక్ష‌రం.. ధాతు మంజరి జీవితం.. ఆ మంజీర నాద‌మే క‌విత్వాంశకు ప్రేర‌ణ.. సీతా రామ శాస్త్రి ప్రాథ‌మికంగా క‌వి.. అవును దివి సీమ‌కు ఉప్పెన వ‌స్తే క‌విత్వం రాయ‌ని క‌వి.. ఆ విధంగా ఆయన ప్రాథ‌మికంగా మ‌నిషి..కొంద‌రికి సాయం చేసి విరాళాలు ఇచ్చి, టెలికాం డిపార్ట్మెంట్ ఉద్యోగిగా స‌గం జీతం ఇచ్చి ఇంకొంత సేక‌రించి పేద‌ల‌ను ఆదుకోవాలి అన్న సంక‌ల్పంతో ఉన్న మ‌నిషి.. మొన్న‌టి వేళ కందికొండ కు సాయం చేయండంటే చేశారు..ఆయ‌నిప్పుడు అనారోగ్యంతో ఉన్నారు. చంద్రబోస్ విన్నపంతో స్పందించి సాయం చేసి మాన‌వ‌త‌ను చాటుకున్నారు. సిరివెన్నెల అనే క‌వి ప్రాథ‌మికంగా మ‌నిషి.. ఇక వివాదాలు వాదాలు వివిధ భార‌తి ప్ర‌సారాలు విని వ‌దిలేయాలి.. నేను ఆ ప‌నే చేస్తాను..మీరు కూడా ఆ ప‌నే చేయండిక..ప్రాణం పుట్టుక ప్రాణికి తెలియాలా.. గానం పుట్టుక గాత్రం చూడాలా.. ఇంకొంత దూరం ప్ర‌యాణిస్తే మా కాలేజీ పిల్ల‌ల‌కు మ‌రికొంత అర్థం అవుతారు సిరివెన్నెల.. నా స్నేహితుల‌కూ శ్రేయోభిలాషుల‌కూ కూడా! నేను అత‌డూ ఇంకొంద‌రూ ఏక‌కాలంలో అర్థం అవుతారు.. రాయ‌డం అంటే బాధ్య‌త అని నేర్పిన అమ్మ‌కు, గురువుకు వంద‌నాలు చెల్లించ‌కుండా ఉండలేను. అమ్మ‌నాన్న‌లకు ఆఖ రుగా వంద‌నాలు చెల్లించి వ‌చ్చాను..పొంగిపోయాను. సుకృతం ఇది.. మీదీ నాదీ మనంద‌రిదీ! మా కాలేజీ బిడ్డ‌లు బాగా మాట్లాడారు.. పొంగిపోయాను..అమృతం కురిసిన రాత్రి లాంటి ఆధునిక వ‌చ‌నం చ‌దవండి అని చెప్పి పుస్త‌కాలు ఇచ్చి వ‌చ్చాను..మా మాస్టారు నేను బాధ్య‌త‌తో రాస్తే పొంగిపోతారు.. బాధ్య‌త‌తో ఉంటే ఆనందిస్తారు. అలానే ఇంకొంద‌రు కూడా!సిరివెన్నెల‌ను కూడా చాలా మంది ప్ర‌భావితం చేశారు. వారందరి స్మ‌ర‌ణ కూడా నిన్న‌టి వేళ ఇవాళ చేస్తూనే ఉండాలి. మంచి గురువు, మంచి చ‌దువు ఈ రెండూ మూలాలు నా జీవితానికి మ‌రియు మీ జీవితాల‌కు కూడా! వాక్యార్థం వ‌చ‌నార్థం రెండూ చెప్పే క్ర మంలో నేను..ఇప్పుడు..ఇక‌పై కూడా! నిన్న‌టి వేళ సిరివెన్నెల స్మ‌ర‌ణ‌లో స్మృతిలో చెప్పిన మాట‌ల సారం రేప‌టి త‌రాల‌ను తప్ప క ప్ర‌భావితం చేయాల‌న్న‌ది ఓ అత్యాశ కాని ఆశ.. మా కాలేజీ మాస్టార్ల‌కు మ‌ళ్లీ వంద‌నాలు చెల్లిస్తూ సైనింగ్ ఆఫ్...- ర‌త్న‌కిశోర్ శంభుమ‌హంతి


మరింత సమాచారం తెలుసుకోండి: