ప్రజాస్వామ్య ప్రపంచంలో కూడా సామ్రాజ్యవాద ధోరణితో నియంత పాలన సాగిస్తూ ముందుకు సాగుతుంది చైనా. ప్రపంచ దేశాలు చైనా తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న అవన్నీ పట్టించుకోకుండా కళ్ళు మూసుకొని పాలు తాగుతున్న పిల్లి లాగా ప్రవర్తిస్తోంది చైనా. ఈ క్రమంలోనే చుట్టుపక్కల ఉన్న చిన్న దేశాల ను స్వాధీనం చేసుకోవడానికి ఎన్నో కుట్రలు పన్నుతూనే ఉంది. దేశాన్ని విస్తరించుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది. ఈ క్రమంలోనే చుట్టుపక్కల ఉన్న అన్ని దేశాలతో కూడా వివాదాలకు తెరలేపింది అన్న విషయం తెలిసిందే. గతంలో భారత్ కు సంబంధించిన భూభాగాన్ని ఆక్రమించుకోవాలని ప్రయత్నించింది చైనా. కానీ భారత ఆర్మీ కలబడి నిలబడటంతో ఇక చైనా కు షాక్ తగిలింది. ఈ క్రమంలోనే ఇక ఇప్పుడు చిన్న దేశాల పై కన్నేసింది చైనా.



 చిన్న దేశాలను భయపెట్టి ఆయా దేశాలను చైనాలో కలుపుకోవడానికి సర్వ ప్రయత్నాలు చేస్తుంది. ఈ క్రమంలోనే చైనా పొరుగుదేశమైన తైవాన్ తో యుద్ధం చేసేందుకు సిద్ధమైంది చైనా. ఈ రెండు దేశాల మధ్య ఏ క్షణంలో ఏం జరుగుతుందో అనే విధంగానే ఉంది ప్రస్తుతం పరిస్థితి. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో అటు నక్క జిత్తుల మారి చైనా కన్ను వియత్నాం పై కూడా పడినట్లు తెలుస్తుంది. ఇటీవల కాలంలో భారత్ సంబంధాలు మెరుగు పరుచుకుంటూ ఏకంగా భారత్కు సంబంధించిన ఆయుధాలను కూడా కొనుగోలు చేసేందుకు సిద్ధమైంది వియత్నాం. ఈ క్రమంలోనే గత కొంత కాలం నుంచి చైనా తీసుకుంటున్న నిర్ణయాలు వియత్నాంకు ఊహించని షాక్ ఇస్తున్నాయి.



 వియత్నాం ను తాము స్వతంత్ర దేశంగా గుర్తించటం లేదని అంటూ చైనాలో ఉన్న వియత్నాం ఎంబసీ కార్యాలయాన్ని మూసివేస్తూ ఇటీవల నిర్ణయం తీసుకుంది చైనా. ఇక ఇప్పుడు వియత్నాం ని కూడా స్వాధీనం చేసుకుని చైనాలో కలుపుకునేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టింది అని తెలుస్తోంది. గతంలో భారత సరిహద్దుల్లో రాళ్లు రువ్వడం పదునైన ఆయుధాలతో దాడి చేయడం లాంటివి చేసిన చైనా సైన్యం ఇక ఇప్పుడు వియత్నాం సరిహద్దుల్లో కూడా ఇలాంటిదే చేస్తుంది అన్నది అర్ధమవుతుంది. వియత్నాం సరిహద్దుల్లో  పనులు చేసుకుంటున్న నిరాయుధులైన కార్మికులపై చైనా సైన్యం రాళ్ళు రువ్వి గాయపరిచినట్లు ఇటీవల అంతర్జాతీయ మీడియాలో తెలుస్తోంది. ఇదే ఇప్పుడు   అంతర్జాతీయ మీడియాలో వైరల్ గా మారినట్లు తెలుస్తోంది. చైనా సృష్టించిన ఈ కొత్త వివాదం ఎక్కడ వరకు దారితీస్తుంది అన్నది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: