మూడో ప్రపంచ యుద్ధం.. ప్రపంచ వ్యాప్తంగా ఇదే చర్చ నడుస్తోంది. దీనికి కారణం అమెరికా రష్యాల మధ్య ఉక్రెయిన్ విషయంలో తెర మీదికి వచ్చిన వివాదం ముదురుతూ ఉండటమే. పొరుగున ఉన్న చిన్న దేశమైన ఉక్రెయిన్ ను స్వాధీనం చేసుకోవడానికి రష్యా ఎన్నో ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే ఉక్రెయిన్ కు సంబంధించిన కొంత భూభాగాన్ని కూడా రష్యా స్వాధీనం చేసుకుం.ది అదే సమయంలో  సరిహద్దుల్లో భారీగా సైనికులను కూడా మోహరించింది రష్యా. ఉక్రెయిన్ సరిహద్దుల్లో నెలకొన్న ప్రతిష్టంభనను తొలగించేందుకు అటు అమెరికా రష్యా తో ఎన్నో రోజుల నుంచి చర్చ జరుపుతుంది అన్న విషయం తెలిసిందే.


 అయితే అమెరికా ఎన్ని చర్చలు జరిపినప్పటికీ అటు రష్యా మాత్రం మొండి పట్టు వీడటం లేదు. ఈ క్రమంలోనే ఇక యుద్ధానికి సిద్ధం అనే సంకేతాలను అమెరికా ఇస్తూ ఉండడం గమనార్హం. ఉక్రెయిన్ కి మద్దతుగా స్వయంగా రంగంలోకి దిగి యుద్ధం చేసేందుకు కూడా అమెరికా సిద్ధం అవుతుంది అని తెలుస్తోంది. ఇప్పటికైనా నాటో కూటమి లో ఉన్న అన్ని దేశాలు కూడా తమ యుద్ధ విమానాలను యుద్ధ నౌకలను కూడా రష్యా సరిహద్దుల్లో మొహరిస్తూ ఉండడం హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇక ఏ క్షణంలో యుద్ధం జరుగుతుందో అని ప్రపంచం మొత్తం ఆందోళనలో మునిగి పోతున్న సమయంలో ఇటీవల అమెరికా జారీ చేసిన ఉత్తర్వులు మాత్రం సంచలనం గా మారిపోయాయి. ఉక్రెయిన్ లో ఉన్నటువంటి అమెరికా రాయబార కార్యాలయానికి సంబంధించిన సిబ్బందిని కుటుంబంతో సహా అమెరికాకు తిరిగి వచ్చేయాలి అంటూ ఆదేశాలు జారీ చేసింది అమెరికా. అయితే ఒక దేశంతో ఉన్న అన్ని సంబంధాలను తెంచుకొనే సమయంలో లేదా యుద్ధం సంభవిస్తుంది అనుకున్న సమయంలోనే ఇలాంటి ఉత్తర్వులు జారీ చేయడం చూస్తూ ఉంటాం. దీంతో ఇప్పుడు అమెరికా జారీ చేసిన ఉత్తర్వులు కాస్త హాట్ టాపిక్ గా మారిపోయాయ్. ఇక యుద్ధానికి రంగంలోకి దిగేందుకు సిద్ధమవుతున్న అమెరికా ఇక తమ దేశ రాయబార కార్యాలయానికి సంబంధించిన సిబ్బందిని  కుటుంబంతో సహా వెనక్కి రావాలని ఉత్తర్వులు జారీ చేసినట్లు అంచనా వేస్తున్నారు నిపుణులు. దీంతో రష్యా అమెరికా యుద్ధం మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీయడం ఖాయం అని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: