2021 అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికానికి సంబంధించిన జగనన్న విద్యాదీవెన నిధులను 10.82లక్షల మంది విద్యార్థుల తల్లుల అకౌంట్లో ప్రభుత్వం ఇవాళ జమచేసింది. ఖాతాల్లో జమ అయిన ఫీజు రీయింబర్స్ మెంట్ సొమ్మును వారం, 10రోజుల్లో కాలేజీలకు చెల్లించాలని ప్రభుత్వం విద్యార్థుల తల్లులకు విజ్ఞప్తి చేసింది. ఫీజను కాలేజీలకు చెల్లించకపోతే.. తదుపరి విడత నేరుగా కాలేజీలకు వెళ్లి చెల్లించాల్సి వస్తుందని పేర్కొంది.
తన పాదయాత్రలో జరిగిన ఘటన ఇప్పటికీ గుర్తుకొస్తుందని సీఎం జగన్ అన్నారు. నెల్లూరు ఓ తండ్రి తన కుమారుడి గురించి చెబుతూ కన్నీరు పెట్టుకున్నాడని గుర్తు చేసుకున్నారు. కాలేజీ ఫీజు లక్ష రూపాయలు కాగా.. రీయింబర్స్ మెంట్ కింద 30వేల రూపాయలు వచ్చాయనీ.. తండ్రి 70వేల రూపాయలు ఇవ్వడంతో ఓ ఏడాది ఇబ్బంది కాలేదన్నారు. మరో ఏడాది అదే పరిస్థితి రావడంతో తండ్రిపై భారం పడుతుందని ఆ అబ్బాయి ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పాడు. ఎవరికీ ఆ పరిస్థితి రావొద్దని సీఎం ఎమోషనల్ అయ్యారు.
విద్య మాత్రమే పేదరికాన్ని దూరం చేస్తుందని సీఎం జగన్ అభిప్రాయపడ్డారు. ఎవరూ దొంగిలించలేని ఆస్తి చదువు అని సీఎం జగన్ అన్నారు. జగనన్న విద్యాదీవెన నిధుల విడుదల సందర్భంగా మాట్లాడిన జగన్.. చదువుతో జీవన స్థితిగతుల్లో మార్పు వస్తుందని చెప్పారు. విద్య మాత్రమే పేదరికాన్ని దూరం చేస్తుందన్నారు. చదువుల కోసం ఎవరూ అప్పులపాలు కావొద్దని అన్నారు. విద్యార్థుల ఉన్నత చదువులు చదివించడమే తమ ఆకాంక్ష అని చెప్పారు. తన తండ్రి ఫీజు రీయింబర్స్ మెంట్ పథకాన్ని తెచ్చారని గుర్తు చేసుకున్నారు.
సీఎం జగన్.. జగనన్న విద్యా దీవెన నిధులు విడుదల చేశారు. 2021 అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికానికి దాదాపు 10.82లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో 709కోట్లు కంప్యూటర్ బటన్ నొక్కి డిపాజిట్ చేశారు. ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు చదివే విద్యార్థులకు ఈ డబ్బులు వేస్తున్నామని సీఎం చెప్పారు. జగనన్న విద్యాదీవెన, జగనన్న వసతి దీవెన కింద 9వేల 274కోట్ల రూపాయలు ఖర్చు చేశామన్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి