కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత  చేపడుతోంది సుపరిపాలన కాదు శుద్ధ దండగ పాలన అంటూ వైసీపీ మాజీ మంత్రి ఆర్కే రోజా మాట్లాడారు..1,60,000 కోట్ల రూపాయల అప్పు చేయడం సుపరిపాలన అంటు ప్రశ్నించింది? ఇటీవలే మీడియాతో మాట్లాడుతూ 81 వేల కోట్ల ప్రజలకు ఎగనామం పెట్టారు అంటు ఫైర్ అయ్యింది రోజా .సూపర్ సిక్స్ అమలు చేయకపోవడమే సుపరిపాలన అంటారా అంటూ ఎద్దేవ చేయడమే కాకుండా.. మహిళలకు పై ఆడపిల్లలపై అత్యాచార సంఘటనలు ఎక్కువగా ఉన్నాయని ఏపీ మొత్తం కూడా గంజాయి డ్రస్సు డోర్ డెలివరీ చేస్తున్నారని.. విద్యుత్ చార్జీలు పెంచడం సుపరిపాలన అంటారా అంటూ ప్రశ్నించింది.



చంద్రబాబు అంటేనే ఒక పెద్ద మోసం.. బాదుడే బాదుడు అన్నట్టుగా మారిపోయారని అధికారంలోకి వచ్చిన తరువాత పెట్రోల్, డీజిల్, విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామని చెప్పారు కానీ పెంచారు.. ఇటీవలే జగన్ కి పొదలిలో వచ్చిన జనాలను చూసి తల్లికి వందనాన్ని అమలు చేశారు.. జగన్ స్కూల్ అభివృద్ధి కోసం 2000 రూపాయలు తగ్గించి వేస్తే సైకో అన్నారు.. ఇప్పుడు మిమ్మల్ని సైకో అనాలా ..సైతాన్ అనాలా అంటూ లోకేష్ జోకేస్ అయ్యారని నవ్వుకుంటున్నారంటు వైసీపీ నేత రోజా వ్యాఖ్యానించారు.



అనంతరం పవన్ కళ్యాణ్ పైన మాట్లాడుతూ ఎవరు ఎక్కడ ఉంటే తనకేంటి అన్నట్టుగా పవన్ కళ్యాణ్ వ్యవహరిస్తున్నారని విద్యార్థులకు రైతులకు ఇబ్బందులు పడుతూ ఉన్న పవన్ కళ్యాణ్ నిద్రపోతున్నారంటూ విమర్శించింది.. అధికారులు వైసిపి నేతల పైన తప్పుడు కేసులు పెట్టిస్తున్నారని .. రైతులలో కూడా కులాలని చూసి మరి మోసం చేస్తున్న ప్రభుత్వం ఇది అంటూ తెలియజేసింది. ఆ సనాతన యోధుడు పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎక్కడ ఉన్నారో తెలియడం లేదని వరసగా దేవాలయాలు కూలిపోతూ ఉంటే పవన్ కళ్యాణ్ ఎక్కడ ఉన్నారు అంటూ ప్రశ్నించింది. చంద్రబాబు రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారనీ ఫైర్ అయ్యింది మాజీ మంత్రి రోజా.. సూపర్ సిక్స్ అమలు చేయకుండానే అమలు చేశామని చెప్పుకుంటున్నారు కనీసం అబద్ధాలు చెప్పడానికైనా సిగ్గు లేదా అంటూ ఫైర్ అయ్యింది.

మరింత సమాచారం తెలుసుకోండి: