
ఆంధ్రప్రదేశ్ సీఎం గా చంద్రబాబు ఆయన కుమారుడు మంత్రి నారా లోకేష్ .. జూనియర్ ఎన్టీఆర్ ను ఉద్దేశించి అసదుద్దీన్ ఓవైసీ చేసిన కీలక వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారాయి .. చంద్రబాబు తనకంటే తన పార్టీ కంటే లోకేష్ కు ఎక్కువ నష్టం చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు .. ఎలా అయినా ఆయన తర్వాత కుమారుడు లోకేష్ కే పార్టీ పగ్గాలు ఇస్తారు కదా ,, జూనియర్ ఎన్టీఆర్ అయితే ఆ పదవికి పోటీ రాదు అంటూ ఓవైసీ చెప్పుకొచ్చారు. అలాగే జూనియర్ ఎన్టీఆర్ ను ఉద్దేశిస్తూ మాట్లాడుతున్న సమయంలో ఎంఐఎం కార్యకర్తలు శ్రేణులు ఎంతో ఉత్సాంహగా చప్పట్లు కొడుతుండగా ఆయన అంత పాపులర్ రా అని ఓవైసీ వారిని అడిగారు .. అలాగే చంద్రబాబు సుదీర్ఘ రాజకీయం అనుభవం ఉన్న నేత ఆయన గతంలో 9 సంవత్సరాల సీఎంగా , 10 సంవత్సరాలు ప్రతిపక్ష నేతగా పనిచేశారని కూడా గుర్తు చేశారు ..
అలాంటి వ్యక్తి లోకేష్ విషయంలో మాత్రం సరైన నిర్ణయం తీసుకోవాలని కూడా ఓవైసీ సూచించారు . ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మంత్రిగా , టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శిగా లోకేష్ ఎంతో చురుగ్గా వ్యవహరిస్తున్నారు .. అలాగే ఇప్పటికే చంద్రబాబుకు లోకేష్ సరైన వారసుడుగా పేరు తెచ్చుకున్నారు .. అలాగే కాబోయే సీఎం అని వ్యాఖ్యలు కూడా టిడిపి నేతలు నుంచి వస్తున్నాయి . ఇలా ఇంత పాజిటివ్ పరిస్థితులు ఉన్న సమయంలో లోకేష్ కు ఎలాంటి నష్టం చేయకుండా తెలుగుదేశం పార్టీ పగ్గాలు ఆయనకు అప్పజెప్పాలని .. ఓవైసీ చేసిన కీలక వ్యాఖ్యలు ఇప్పుడు తెలుగు రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి .