ప్రస్తుత వైసీపీ ప్రభుత్వంలో అత్యంత కీలకంగా వ్యవహరిస్తున్న మంత్రి ఎవరైనా ఉన్నారంటే..అది బొత్స సత్యనారాయణనే చెప్పొచ్చు. మూడోసారి మంత్రి అయిన బొత్స...రాష్ట్ర రాజకీయాలపై మంచి పట్టు ఉన్న నేత. 1999లో తొలిసారి బొబ్బిలి నుంచి కాంగ్రెస్ ఎంపీగా గెలిచిన బొత్స... 2004, 2009ల్లో చీపురుపల్లి నుంచి ఎమ్మెల్యేగా గెలిచి దివంగత వైఎస్సార్ కేబినెట్లో మంత్రిగా పని చేశారు. వైఎస్సార్ చనిపోయాక కూడా రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాల్లో కీలకంగా వ్యవహరించారు. అయితే 2014లో బొత్స కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓడిపోయి....తర్వాత జగన్ నేతృత్వంలోని వైసీపీలో చేరిపోయారు. ఇక అక్కడ నుంచి వైసీపీ బలోపేతానికి కృషి చేశారు.


ఈ క్రమంలోనే మొన్న ఎన్నికల్లో చీపురుపల్లి నుంచి పోటీ చేసి గెలిచి...జగన్ కేబినెట్ లో స్థానం కొట్టేశారు. మంత్రిగా పని చేసిన అనుభవం ఉండటం, రాష్ట్ర పరిస్థితులపై అవగాహన ఉండటంతో జగన్ కేబినెట్ లో చోటు కల్పించారు. ఇక బొత్స తన అనుభవం తగ్గట్టుగానే ప్రభుత్వంలో నడుస్తూ....అందరు మంత్రులకంటే స్పీడుగా వెళుతున్నారు. జగన్ మీడియా ముందుకొచ్చే అలవాటు తక్కువ ఉండటంతో...బొత్సనే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలని ప్రజల్లోకి తీసుకెళుతున్నారు.


ఒకానొక దశలో ప్రభుత్వంలో జగన్ తర్వాత బొత్సనే నెంబర్2 అనే విధంగా నడిచింది. ఇక మున్సిపల్ శాఖ మంత్రిగా బొత్స ఈ మూడు నెలల పరిపాలన కాలంలో బాగా రాణించారు. తనకున్న సీనియారిటీతో జగన్ తో కలిసి పలు కీలక నిర్ణయాలు కూడా తీసుకున్నారు. ముఖ్యంగా రాజధాని అమరావతి విషయంలో నిజాలని బయటపెట్టి  గత టీడీపీ ప్రభుత్వ నిర్వహకాలని వెలుగులోకి తీసుకొచ్చారు. వరదల వస్తే రాజధానిలో ఇబ్బందులు ఎదురవుతాయని ఓపెన్ గానే చెప్పారు. అయితే రాజధాని మార్చే అవకాశముందని ప్రకటించి విమర్శలు కూడా కొనితెచ్చుకున్నారు.


అటు తమ ప్రభుత్వం మీద టీడీపీ చేసే ప్రతి విమర్శకు బొత్సనే ముందుగా రియాక్ట్ అయ్యి కౌంటర్ ఇచ్చారు. ఏ విషయంలోనైనా ప్రభుత్వానికి ఇబ్బంది రాకుండా చూసుకున్నారు. అయితే ఒకోసారి ఆయన మీడియా ముందు నోరు జారడం వల్ల కొన్ని విమర్శలు కూడా వచ్చాయి. ఈ విషయంలో జగన్ కూడా కాస్త సీరియస్ అయ్యారనే వార్తలు కూడా వచ్చాయి. ఏది ఏమైనా బొత్స తనకున్న అనుభవంతో మంత్రి పదవిని సజావుగా నిర్వహిస్తున్నారనే చెప్పాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: