క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఐపీఎల్ 14 వ సీజన్ కు కౌన్ డౌన్ మొదలైంది. క్రికెట్ అభిమానులకు సమ్మర్ లో కూల్ వినోదాన్ని పంచేందుకు ఐపీఎల్ సిద్దమైంది. ఇప్పటికే జట్లు అన్నీ కూడా ముమ్మర కసరత్తులు చేసి టైటిల్ పై కన్నెశాయి. ఈ సారి జట్లు అన్నీ కూడా చాలా మార్పులతో టైటిల్ బరిలో నిలుస్తున్నాయి. ఇక ఈ సారి కూడా హాట్ ఫేవరెట్ గా డీపెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ బరిలో దిగుతుండగా..ఇప్పటివరకు ఐపీఎల్ చరిత్రలో మోస్ట్ సక్సస్ రేట్ ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ జట్టు గత ఏడాది ఎవ్వరూ ఊహించని రీతిలో ఘోరంగా విఫలం చెంది లీగ్ దశలోనే వెనుదిరిగింది.

దీంతో ఈ ఏడాది ఆ చేదు జ్ఞాపకాలను మరిచి ఈ సారి కొత్త జోష్ తో పోరుకు సిద్దమైంది. చెన్నై కెప్టెన్ ధోని కూడా ఈసారి ఫుల్ స్వింగ్ లో కనిపిస్తున్నాడు. ఇప్పటికే ప్రాక్టీస్ లో తనదైన మార్క్ షాట్స్ తో దనాధన్ ధోని ని గుర్తుకు తెస్తున్నాడు. ఇక తాజాగా ఆ చెన్నై యజమాన్యం నుండి తుది జట్టుకు సంబంధించి కొన్ని సంకేతాలు వస్తున్నాయి. ధోని స్ఫూర్తిదాయక నాయకత్వంతో చెన్నై ఈ సారి టైటిల్ పై గట్టిగానే కన్నెసింది.గత ఏడాది ఐపీఎల్ నుండి అర్ధాంతరంగా నిష్క్రమించిన చిన్న తలా సురేష్ రైనా తిరిగి రావడం చెన్నైకి సానుకూలంశం.

 కాగా.. ఫాఫ్ డుప్లెసిస్, ధోని, అంబటి రాయుడు, రవీంద్ర జడేజా, సామ్ కరన్, మొయిన్ అలీ, రితురాజ్ గైక్వాడ్ వంటి ఆటగాళ్లతో అటు మిడిల్ ఆర్డర్.. ఇటు ఓపెనింగ్ చాలా బలంగా ఉంది. అయితే చాలా కాలం తరువాత మళ్ళీ ఐపీఎల్ లోకి అడుగు పెడుతున్న టెస్ట్ స్పెషలిస్ట్ చటేశ్వర్ పూజారా కు తుది జట్టులో స్థానం ఉంటుందా అనేది ఆసక్తికరంగా మారింది. ఇక సీఎస్కే‌కు ప్రధాన బలం బౌలింగ్ ఎటాక్. లుంగి ఎన్గిడి, శార్దుల్ ఠాకూర్, సామ్ కరన్, ఇమ్రాన్ తాహిర్, జడేజా, దీపక్ చాహర్ వంటి మేటి బౌలర్లు ఉన్నారు. మరి ఈ సారి చెన్నై ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి. 

డిల్లీ తో తలపడే తుది జట్టు ( అంచనా ) : డుప్లెసిస్ , రుతురాజ్ గైక్వాడ్ , సురేష్ రైనా, అంబటి రాయుడు , ఎం.ఎస్.ధోని(కెప్టెన్ & వికెట్ కీపర్) , మొయిన్ అలీ , రవీంద్ర జడేజా ,సామ్ కరన్ , శార్దుల్ ఠాకూర్, దీపక్ చాహార్ , ఇమ్రాన్ తాహిర్  .

మరింత సమాచారం తెలుసుకోండి: