ఒకప్పుడు ప్రపంచ క్రికెట్లో అత్యుత్తమ ఆటగాడిగా ఎన్నో రికార్డులు కొల్లగొట్టిన విరాట్ కోహ్లీ ఇటీవలి కాలంలో మాత్రం పేలవమైన ఫామ్ తో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. ఒకప్పుడు క్లిష్ట పరిస్థితుల్లో అందరూ బ్యాట్స్మెన్లు చేతులెత్తేసిన సమయంలో తనదైన శైలిలో రాణిస్తూ టీమిండియాకు ఒంటిచేత్తో విజయాన్ని అందించిన విరాట్ కోహ్లీ ఇప్పుడు మాత్రం పరుగులు చేయడానికి తెగ ఇబ్బంది పడిపోతాడు. వరుసగా సెంచరీలు చేస్తూ బౌలర్ల వెన్నులో వణుకు పుట్టించిన విరాట్ కోహ్లీ ఇప్పుడు అనవసరమైన షాట్లు ఆడుతూ వికెట్ చేజార్చుకుంటున్నాడు. కేవలం ఒక్క మ్యాచ్క్ కాదు ప్రతి మ్యాచ్లో కూడా విరాట్ కోహ్లీ పేలవమైన ఫామ్ టీమిండియాకు ఎంతో మైనస్ గానే మారిపోతుంది అని చెప్పాలి.


 భారీ అంచనాల మధ్య బరిలోకి దిగుతున్న విరాట్ కోహ్లీ తక్కువ పరుగులకే వికెట్ చేజార్చుకుంటూ ఉండడంతో ఎంతో మంది మాజీ క్రికెటర్లు విరాట్ కోహ్లీ పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే కెప్టెన్సీకి గుడ్బై చెప్పిన తర్వాత అయినా విరాట్ కోహ్లీ బ్యాటింగ్ తీరులో మార్పు వస్తుందని అందరూ అనుకున్నారు. కానీ కెప్టెన్సీ వదులుకున్న కూడా అదే పేలవమైన ఫామ్ తో ఇబ్బంది పడుతున్నాడు విరాట్ కోహ్లీ.  ఇకపోతే ఇటీవల విరాట్ కోహ్లీ ఒక చెత్త రికార్డును నమోదు చేశాడు. వన్డే క్రికెట్ లో అత్యధిక సార్లు డక్ అవుట్ అయిన రికార్డు కోహ్లీ ఖాతాలో చేరిపోయింది.

 ఇటీవల సౌతాఫ్రికాతో జరిగిన రెండవ వన్డే మ్యాచ్లో విరాట్ కోహ్లీ ఒక్క పరుగు కూడా చేయకుండానే వెనుదిరిగాడు. ఇలా వన్డే కెరీర్లో 14వ సారి డకౌట్ అయ్యి విరాట్ కోహ్లీ చెత్త రికార్డును సాధించాడు. ఇప్పటివరకు ఎన్నో అద్భుతమైన రికార్డులను సాధించిన విరాట్ కోహ్లీ ఖాతాలో చెత్త చేరుకోవడంతో కోహ్లీ అభిమానులు అందరూ ఎంతగానో నిరాశలో మునిగిపోయారు. అయితే అంతకుముందు ఈ రికార్డు రాహుల్ ద్రావిడ్ (13 ) రోహిత్ (13) పేరుపై ఉండగా ఇక ఇప్పుడు కోహ్లీ వీరిని దాటడంతో హామ్మయ్య అత్యధికసార్లు డక్ అవుట్ అయిన  రికార్డు రోహిత్ శర్మ ఖాతాలో లేకుండా పోయిందని హిట్మ్యాన్ అభిమానులు సంతోషపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: