అదృష్టం కలిసి వస్తే కష్టపడకున్నా పర్లేదు కాలు మీద కాలేసుకుని కూర్చున్న కూడా జరగాల్సింది జరిగిపోతుంది అంటుంటారు కదా. ఐపీఎల్లో కొంతమంది విషయంలో ఇదే జరిగింది అని చెప్పాలి. ఎంతో మంది ఆటగాళ్లు ఐపీఎల్లో ప్రతి మ్యాచ్లో చెమటోడ్చి కష్ట పడుతూ పరుగులు తీయడం వికెట్లు తీయడం లాంటివి చేస్తారు. ఇక జట్టు విజయం అందించడంలో కూడా కీలకపాత్ర వహించారు. మరికొంతమందిలో పేలవ ప్రదర్శనతో విమర్శలు ఎదుర్కొంది. కాని కొంత మంది ఆటగాళ్లు మాత్రం ఒక్క మ్యాచ్ కూడా ఆడకుండానే ఒకవైపు కోట్ల రూపాయలు వెనకేసుకోవడమే కాదు టైటిల్ సాధించిన జట్టులో సభ్యులుగా కూడా ఉండడం గమనార్హం.


 మెగా వేలం సమయంలో జట్టును పటిష్టంగా మార్చుకునేందుకు కొంత మంది ఆటగాళ్లను జట్టులోకి తీసుకున్న ఫ్రాంచైజీలు కొంతమందిని బెంచ్ కు పరిమితం చేశాయి. ఇందులో కొంతమంది మొత్తం ఐపీఎల్  లో ఒక్క మ్యాచ్ కూడా లేదనే చెప్పాలి. ఇలాంటి వారి వివరాలు తెలుసుకుందాం.

 జయంత్ యాదవ్ : ఐపీఎల్ మెగా వేలంలో 1.7 కోట్లకు జయంత్ యాదవ్ ను కొనుగోలు చేసింది గుజరాత్.  లక్నో తో పోటీపడి మరీ  సొంతం చేసుకుంది.  కానీ ఒక్క సారి కూడా తుది జట్టులో అవకాశం రాలేదు. కానీ టైటిల్ గెలిచిన గుజరాత్ జట్టులో సభ్యుడిగా మాత్రం ఉన్నాడు.


 డొమినిక్ డెట్స్ : ఐపీఎల్లో అత్యంత అదృష్టవంతుడు ఇతనే అని చెప్పవచ్చు. ఒక్క మ్యాచ్ కూడా ఆడకుండానే గతంలో రెండు సార్లు టైటిల్ గెలిచిన జట్టులో భాగస్వామ్యం అయ్యాడు. గత సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ లో బెంచ్ కే పరిమితం చేశాడు. గుజరాత్ సైతం పోటీపడి మరి అతని దక్కించుకుంది. 5.1 కోట్లకు కొనుగోలు చేయగా ఒక  మ్యాచ్ కూడా ఆడకుండానే టైటిల్ గెలుచుకున్న జట్లలో చేరిపోయాడు.


 రాజ్ వర్ధన్ : భారత అండర్-19 జట్టుకు సభ్యుడైన ఇతను వన్డే ప్రపంచకప్ ఆధారగొట్టాడు. చెన్నై జట్టు 1.5 కోట్లు పెట్టి కొన్నా.. బెంచ్ కే పరిమితం చేసింది.   దీంతో ఒక్క మ్యాచ్ కూడా ఆడకుండానే కోట్లు వెనకేసుకున్నారు ఈ ఆటగాడు..

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl