టీమిండియా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా ప్రస్తుతం ఫుల్ స్వింగ్లో దూసుకుపోతున్నాడు అన్న విషయం తెలిసిందే. అంతకు  ముందు వరకు గాయం బారినపడి జట్టుకు దూరమైన ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న హార్దిక్ పాండ్యా ఐపీఎల్ ద్వారా మళ్ళీ క్రికెట్ లోకి వచ్చాడు. ఈ క్రమంలోనే గుజరాత్ కెప్టెన్గా వ్యవహరించిన హార్దిక్ పాండ్యా ఒకవైపు జట్టును ముందుకు నడిపిస్తూ ఓ వైపు ఒక ఆటగాడిగా కూడా సత్తా చాటాడు. కాగా మొదటి ప్రయత్నంలోనే గుజరాత్ జట్టుకు ఐపీఎల్ టైటిల్ అందించి చరిత్ర సృష్టించాడు. అతను మంచి ఫామ్ లోకి రావడంతో టీమిండియాలో కూడా అవకాశం దక్కింది.


 టీమ్ ఇండియా తరపున కూడా అదేరీతిలో అద్భుత ప్రదర్శన చేస్తున్నాడు. అదృష్టం కలిసి వచ్చి అతనికి టీమిండియా కెప్టెన్సీ వహించే అవకాశం కూడా వచ్చింది. కెప్టెన్సీ లో కూడా అదరగొట్టేస్తున్నాడు హార్థిక్ పాండ్య. హార్దిక్ పాండ్యా జట్టులో ఉండటంపై జింబాబ్వే బ్యాటింగ్ కోచ్ గా ఉన్న క్లూసెనర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏ జట్టు కైనా సరే హార్థిక్  లాంటి ప్లేయర్ అవసరం అంటూ చెప్పుకొచ్చాడు. అతను మళ్లీ ఫామ్ లోకి రావడం ఆనందంగా ఉంది అంటూ తెలిపాడు. పాండ్య  ఉంటే భారతజట్టు ఎంతో భిన్నంగా పటిష్టంగా ఉంటుందని చెప్పుకొచ్చాడు.


 హార్దిక్ పాండ్యా  అలాంటి ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్ జట్టు లో ఉంటే జట్టు కాస్త ఎడ్జ్ ఉంటుంది. ప్రస్తుతం తనదైన ఫామ్ కనబరుస్తున్నాడు హార్దిక్ పాండ్యా. హార్దిక్ పాండ్యా ఫుల్ ఫ్లో లో ఉన్నాడు అంటూ చెప్పుకొచ్చాడు.  ఇక భారత్తో జరగబోయే వన్డే సిరీస్ జింబాబ్వే జట్టు మంచి ప్రాక్టీస్ అవుతుందని.. జింబాబ్వే ఆటగాళ్లు అంతర్జాతీయ స్థాయి ఆటను నేర్చుకునేందుకు మరింతగా ఎదగడానికి మంచి అవకాశం ఉందని క్లూసెనర్ తెలిపాడు.  ఎన్నో రోజుల నుంచి ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సిరీస్ ఇది అంటూ తెలిపాడు. టీమిండియా తో వన్డే సిరీస్ జింబాబ్వే జట్టు కు గొప్ప సవాలు లాంటిదే అంటూ చెప్పుకొచ్చాడు క్లూసెనర్.

మరింత సమాచారం తెలుసుకోండి: