అదేంటి టైటిల్ చూడగానే అవాక్కయ్యారు కదా.. మాజీ క్రికెటర్ మహేంద్రసింగ్ ధోని డిగ్రీ పరీక్షలు రాయడం ఏంటి అని ఆశ్చర్య పోయారు కదా.. అసలు ఈ వార్త నిజమేనా అబద్దమా అని ఆలోచనలో పడిపోయారు కదా.. ఇదంతా నిజమే.. నిజంగానే మాజీ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ డిగ్రీ పరీక్షలు రాయబోతున్నాడు. ధోనీతో పాటు  ప్రధాని నరేంద్ర మోడీ కూడా డిగ్రీ పరీక్షలు రాస్తున్నాడు అనే చెప్పాలి.  ఇక ఇదంతా చదివిన తర్వాత కాస్త కన్ఫ్యూషన్ లోనే  ఉన్నట్టున్నారు. ఇంతకీ ఇదంతా ఏంటో తెలుసా నకిలీ హాల్ టిక్కెట్ల గోల. సెలబ్రిటీల పేర్లతో యూనివర్సిటీ కాలేజీ లలో అడ్మిషన్లు హాల్ టికెట్ పై ఫోటోతో పాటు పేర్ల ముద్రణ జరగడం అప్పుడప్పుడు వెలుగులోకి వస్తూ ఉంటుంది. ఇలాంటి ఘటనలు ఎప్పుడూ హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటాయి.



 కొందరు ఆకతాయిలు చేసే పనుల వల్ల ఏకంగా యూనివర్సిటీలకు చెడ్డ పేరు వస్తుంది అని చెప్పాలి. సాంకేతిక లోపంతో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. బీహార్ లోని ఒక యూనివర్సిటీలో ఇలాంటిదే జరిగింది.  డిగ్రీ పరీక్షలు అడ్మిట్ కార్డులపై ప్రధాని నరేంద్ర మోడీ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ ఫోటోలు ముద్రించడం కలకలం రేపింది.  దీనిపై యూనివర్సిటీ దర్యాప్తుకు ఆదేశించటం గమనార్హం. లలిత్ నారాయణ్ మిథిల యూనివర్సిటీ లో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. డిగ్రీ పరీక్షల కోసం అడ్మిట్ కార్డులు జారీ చేశారు. ఇందులో నరేంద్ర మోడీ మహేంద్రసింగ్ ధోని బీహార్ గవర్నర్ ఫోటోలు కూడా ఉన్నాయి.


 ఇది చూసి విద్యార్థులు అందరూ కూడా షాక్ అయ్యారు అని చెప్పాలి. కానీ ఈ విషయం యూనివర్సిటీ దృష్టికి వెళ్లింది. అధికారులు సీరియస్ అయ్యారు. ఫోటోలను ఎంతోమంది ఆకతాయిలు అయిన విద్యార్థులు అప్లోడ్ చేసి ఉంటారని భావిస్తున్నామని అధికారులు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇందుకు కారణమైన వారికి షోకాజ్ నోటీసులు జారీ చేయడంతో పాటు ఎఫ్ఐఆర్ నమోదు అయ్యేలా చర్యలు చేపడతామని చెప్పారు. అడ్మిట్ కార్డుల జారీ ప్రక్రియ ఆన్లైన్లో కొనసాగుతుండగా విద్యార్థులు ఇలాంటి పనులు చేసి ఉంటారని అనుకుంటున్నారట. కాగా దీనిపై దర్యాప్తు కొనసాగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: