2023 ఐపీఎల్ సీజన్ కు సంబంధించి అటు బీసీసీఐ ఇప్పటినుంచి సన్నాహాలు ప్రారంభించింది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇటీవల వచ్చే ఏడాది ఐపీఎల్ సీజన్ కు సంబంధించి రిటెన్షన్ ప్రక్రియను పూర్తి చేసింది బీసీసీఐ. ఇందులో భాగంగానే ఎన్నో జట్లు ఇక తమతో అంటిపెట్టుకొనే ఆటగాళ్ల వివరాలతో పాటు ఇక వేలంలోకి వదిలేసే ఆటగాళ్ల వివరాలను కూడా బీసీసీఐకి అందించింది. అయితే ఇందులో ఏకంగా ఛాంపియన్ ముంబై ఇండియన్స్ జట్టు 13 మంది ఆటగాళ్లను వేలంలోకి వదిలేయగా.. కోల్కతా నైట్ రైడర్స్ జట్టు ఏకంగా 16 మంది ఆటగాళ్లను వదులుకునేందుకు సిద్ధమైంది అని చెప్పాలి.సన్రైజర్స్ 12 మందిని వదిలేసింది.


 ఇక కొన్ని జట్ల యాజమాన్యాలు అయితే జడ్డు కెప్టెన్లను సైతం వదులుకునేందుకు వెనకడుగు వేయలేదు. సన్రైజర్స్ ఆశ్చర్యకరంగా జట్టు కెప్టెన్ కి  మిలియమ్సన్ ను వేలంలోకి విడిచిపెట్టి అందరిని ఆశ్చర్యపరిచింది. ఇక పంజాబ్ కింగ్స్ మయాంక్ అగర్వాల్ సైతం వేలంలోకి విడిచిపెట్టింది అని చెప్పాలి. అయితే మరికొన్ని రోజుల్లో మినీ వేలం జరగబోతున్న నేపథ్యంలో ఇక ఏ జట్టు దగ్గర ఎంతపర్స్ మనీ ఉంది అన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారిపోయింది అని చెప్పాలి.

ఒకసారి ఆ వివరాలు చూసుకుంటే.. లక్నో సూపర్ జెయింట్స్ వద్ద రూ.23.35 కోట్లు, ముంబై ఇండియన్స్ వద్ద రూ.20.55 కోట్లు, చెన్నై సూపర్ కింగ్స్ వద్ద రూ. 20.45 కోట్లు, ఢిల్లీ క్యాపిటల్స్ వద్ద రూ. 19.45 కోట్లు, గుజరాత్ టైటాన్స్ వద్ద రూ.19.25 కోట్లు, రాజస్థాన్ రాయల్స్ వద్ద రూ.13.2 కోట్లు, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వద్ద రూ.8.75 కోట్ల పర్స్ ఉంది. కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు వద్ద అందరికంటే తక్కువగా రూ.7.05 కోట్ల పర్స్ మాత్రమే ఉంది. ఇక మరికొన్ని రోజుల్లో జరగబోయే  వేలంలో ఏ జట్టు ఎవరిని కొనుగోలు చేయబోతున్నాయి అన్నది కూడా ఆసక్తికరంగా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl