మహిళల ప్రీమియర్ లీగ్ లో సీజన్ 1 ఇప్పుడే కీలక దశకు చేరుకుంటోంది. అయిదు జట్లతో మొదలు పెట్టిన ఈ టోర్నీ సక్సెస్ ఫుల్ గానే రన్ అవుతోంది అని చెప్పాలి. వరల్డ్ విమెన్ ప్లేయర్స్ ఇందులో పాల్గొనడంతో ప్రతి మ్యాచ్ కూడా చాలా ఉత్కంఠగా జరుగుతోంది. అయితే ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్ లను బట్టి చూస్తే మాత్రమే విదేశీ ప్లేయర్స్ మరియు స్వదేశీ అంతర్జాతీయ ప్లేయర్స్ మినహా దేశవాళీ మహిళా ప్లేయర్స్ ఆకట్టుకోవడంలో విఫలం అయ్యారు. కానీ ఈ సీజన్ లో ఇంకా మ్యాచ్ లు ఉండడంతో ముందు ముందు అయినా ఆకట్టుకుంటారా చూడాలి.

కాగా ఈ రోజు మ్యాచ్ లో పాయింట్ల పట్టికలో ఇంకా బోణీ కూడా కొట్టని రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు మహిళల జట్టు ఢిల్లీ క్యాపిటల్స్ తో తలపడుతోంది. మొదట టాస్ గెలిచిన ఢిల్లీ కెప్టెన్ మెగ్ లానింగ్ బౌలింగ్ తీసుకుంది. చావో రేవో మ్యాచ్ లో బ్యాటింగ్ చేస్తున్న బెంగుళూరు తీవ్రంగా తడబడుతోంది. ఇక బెంగుళూరు కెప్టెన్ స్మృతి మందన్న అయితే ఎంతో కీలకం అయిన ఈ మ్యాచ్ లోనూ కేవలం 8 పరుగులు చేసి శిఖా పాండే బౌలింగ్ లో అవుట్ అయింది. దీనితో ఈ టోర్నీలో స్మృతి మందన్న ఫెయిల్యూర్ రన్ కొనసాగుతోంది.

ఇప్పటి వరకు స్మృతి మందన్న ఆడిన అయిదు మ్యాచ్ లలో వరుసగా ఢిల్లీ పై 35 పరుగులు , ముంబై పై 23 పరుగులు , గుజరాత్ జాయింట్స్ పై 18 పరుగులు , యూపీ వారియర్స్ పై 4 పరుగులు మరియు నేడు ఢిల్లీ జరుగుతున్న రెండవ మ్యాచ్ లోనూ 8 పరుగులు మాత్రమే చేసి అభిమానులను నిరాశపరిచింది. ఇండియన్ టీం లో కీలక ప్లేయర్ గా ఉన్న స్మృతి మందన్న ఈ లీగ్ లో ఎందుకు ఇలా ఫెయిల్ అవుతోంది అంటూ అభిమానులు తలలు పట్టుకుంటున్నారు. అయితే స్మృతి మందన్న కు కెప్టెన్సీ ఇవ్వడమే ఆమె స్వేచ్చాయుత బ్యాటింగ్ కు అడ్డుగా మారిందని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
 


మరింత సమాచారం తెలుసుకోండి: