మార్చ్ 31వ తేదీ నుంచి ఐపీఎల్ సీజన్ ప్రారంభం కాబోతుంది. ఈ క్రమంలోనే ఇప్పటికే ఐదుసార్లు టైటిల్ విజేతగా కొనసాగుతున్న ముంబై ఇండియన్స్ ఈ ఏడాది అద్భుతంగా రానించి ఆరోసారి కూడా ఐపీఎల్ టైటిల్ ముద్దాడాలని ఎంతో పట్టుదలతో ఉంది అని చెప్పాలి. అయితే ఇక 2023 ఐపీఎల్ సీజన్లో అటు ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ ముందు మాత్రం ఎన్నో అరుదైన రికార్డులు ఉన్నాయి అని చెప్పాలి. ఇక రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు మాజీ కెప్టెన్ అయిన విరాట్ కోహ్లీ సాధించిన రికార్డులను ఇక అటు రోహిత్ శర్మ బద్దలు కొట్టబోతున్నాడు అన్నది తెలుస్తుంది.


 రోహిత్ శర్మ ఐపీఎల్లో 6000 పరుగుల మైలురాయని అందుకునేందుకు.. 121 పరుగుల దూరంలో మాత్రమే ఉన్నాడు. కాగా ఇప్పటికే విరాట్ కోహ్లీ శిఖర్ ధావన్ మాత్రమే ఈ రికార్డు సాధించారు. ఇక ఈ సీజన్లో రోహిత్ ఈ రికార్డును బద్దలు కొట్టే ఛాన్స్ ఉంది. కాగా 2011లో ముంబై ఇండియన్స్ లో చేరిన దగ్గర నుంచి ఇక ఆ ఫ్రాంచైజీ కోసం 182 మ్యాచులలో 4709 పరుగులు చేశాడు రోహిత్. ఇక ముంబై ఇండియన్స్ తరఫున 5000 పరుగులు మార్గం అందుకోవాలంటే ఇంకా 291 పరుగులు చేయాలి. ఇలా చేస్తే ఒకే ఫ్రాంచైజీ కి 5000 లేదా అంతకంటే ఎక్కువ పరుగులు చేసిన ఏకైక ఆటగడిగా  ఉన్న కోహ్లీ రికార్డును బద్దలు కొడతాడు. రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్ కెప్టెన్గా 150 మ్యాచ్లు పూర్తి చేయడానికి మరో ఏడు మ్యాచ్లు ఆడాల్సి ఉంది. కాగా ఇప్పటివరకు చెన్నై కెప్టెన్ ధోని 210 ఈ ఘనత సాధించిన ఏకైక ప్లేయర్గా ఉన్నాడు. ఇక రోహిత్ 143 మ్యాచ్లలో జట్టుకు 79 విజయాలు అందించాడు.ఇక ఇప్పటికే టీ20 క్రికెట్లో 10703 పరుగులు చేసిన రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ11326 పరుగుల మైల్ స్టోన్ ని బద్దలు కొట్టేందుకు సిద్ధమవుతున్నాడు. దీనికి మరో 297 పరుగులు చేస్తే సరిపోతుంది. ఇక రోహిత్ శర్మ ఇప్పుడు వరకు ఫీల్డర్ గా కూడా సత్తా చాటాడు. ఏకంగా ఐపీఎల్లో 97 క్యాచ్లు పట్టాడు. మరో మూడు క్యాస్ట్ పడితే 100 క్యాచ్ లు అందుకున్న ప్లేయర్గా రికార్డు సృష్టిస్తాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: