
లేదంటే ఏదో ఒక ఫార్మాట్ కి మాత్రమే పరిమితమై మిగతా ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించడం లాంటివి కూడా చేస్తూ ఉన్నారు. ఇక ఇలా చేసి కొన్ని కొన్ని సార్లు విమర్శలు ఎదుర్కొంటున్నారు క్రికెటర్లు. అయితే ఇటీవల ఇంగ్లాండు క్రికెటర్ జాసన్ రాయ్ విషయంలో కూడా ఇలాంటి వార్తలు ఒక్కసారిగా హాట్ టాపిక్ గా మారిపోయాయి. జాసన్ రాయ్ ఏకంగా ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు కాంట్రాక్టు రద్దు చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే మేజర్ లీగ్ క్రికెట్లో పాల్గొనాలి అనే ఉద్దేశంతోనే ఇలా ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు కాంట్రాక్టును రద్దు చేసుకుంటున్నట్లు వార్తల్లో సారాంశం ఉంది. ఈ క్రమంలోనే అతనిపై విమర్శలు కూడా వచ్చాయి.
అయితే ఈ విషయంపై స్వయంగా ఇంగ్లాండ్ క్రికెటర్ జాసన్ రాయ్ స్పందించాడు. దేశానికి ప్రాతినిధ్యం వహించడం నాకు గర్వకారణంగా ఉంటుంది. నా మొదటి ప్రాధాన్యత కూడా అదే అంటూ వార్తలకు చెక్ పెట్టాడు జాసన్ రాయ్. అయితే మేజర్ లీగ్ క్రికెట్ లో పాల్గొనడం గురించి ఇంగ్లాండు క్రికెట్ బోర్డుతో చర్చలు జరుపుతున్నాను అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం సెంట్రల్ కాంట్రాక్ట్ లేని సింగిల్ ఫార్మాట్ ప్లేయర్గా కొనసాగుతున్న తాను.. ఇక లీగ్ మ్యాచ్లలో వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని అనుకుంటున్నాను అంటూ జాసన్ రాయ్ చెప్పుకొచ్చాడు. కాగా జాసన్ రాయ్ ఐపీఎల్ లో కూడా ఫ్రాంచైజీల తరఫున ఆడాడు.