ప్రపంచ క్రికెట్లో అత్యధిక ఆల్ రౌండర్లు కలిగిన దేశం ఏది అంటే అందరూ చెప్పే ఏకైక సమాధానం వెస్టిండీస్ అనడంలో ఏ విధమైన సందేహం కలగదు. అలాంటిది జట్టు ఐదు సంవత్సరాల నుంచి ఒక్కటంటే ఒక్కటి వన్డే సిరీస్ గెలవలేదు. ఇంకా అసలు విషయానికి వస్తే ఐదేళ్ల తర్వాత వెస్టిండీస్ జట్టు వన్డే సిరీస్ నెగ్గింది. శనివారం అఫ్ఘానిస్థాన్‌ తో  జరిగిన రెండో వన్డేలో 47 పరుగుల తేడాతో విజయం సాధించింది. 


అయితే తొలుత బ్యాటింగ్ చేసిన వెస్ట్ ఇండీస్ జట్టు నిర్ణీత ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 247 పరుగులు చేసింది. విండీస్ బ్యాట్స్ మెన్స్ నికోలస్ పూరన్ (67; 50 బంతుల్లో 7x4, 3x6), ఎవిన్ లూయిస్ (54; 75 బంతుల్లో 6x4, 1x6) రాణించారు. అనంతరం లక్ష్య ఛేదనకు వచ్చిన అఫ్ఘాన్ 45.4 ఓవర్లలో 200 పరుగులకు ఆల్ అవుట్ అయ్యింది. నజీబుల్లా జద్రాన్ (56; 66 బంతుల్లో 7x4, 1x6) రాణించినా అతడికి సహకరించే బ్యాట్స్ మెన్ కరువు అయ్యారు.


ఈ పరిస్థితులలో ఆ జట్టు రెండో ఓటమిని కూడా చవిచూసింది. కాట్రెల్, రోస్టన్ ఛేజ్, వాల్ట్ చెరో మూడు వికెట్లు తీసి విండీస్ విజయంలో అసలైన పాత్ర పోషించారు. దీనితో మూడు వన్డేల సిరీస్ ను విండీస్ ఒక మ్యాచ్ మిగిలుండగానే గెలుపు పొందింది. ఇదిలా ఉండగా రషీద్ ఖాన్ జట్టుకు ఇది వరుసగా పదకొండో వన్డే ఓటమి కావడం గమనార్హం. మరో వైపు విండీస్ 2014 ఆగస్టులో బంగ్లాను ఓడించగా, ఐదేళ్ల తర్వాత ఆఫ్ఘన్ ను ఓడించి వన్డే సిరీస్ గెలుపొందింది.


ఈ విజయం పై స్పందించిన విండీస్ కెప్టెన్ పొలార్డ్ తన ఆటగాళ్లతో కలిసి సెలబ్రేట్ చేసుకోవాలనుందని తెలిపాడు. గెలుపును ఆస్వాదించాల్సిన అవసరముందన్నాడు పోలార్డ్. సోమవారం జరిగే మళ్లీ ఫైనల్ మ్యాచ్ గెలవడానికి బరిలోకి దిగుతామని అయన తెలియచేసాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: