రోడ్ సేఫ్టీ వరల్డ్ టీ 20 సిరీస్ లో భాగంగా  శనివారం ముంబై లో ఇండియా లెజెండ్స్,వెస్టిండీస్ లెజెండ్స్ మధ్య జరిగిన మొదటి మ్యాచ్ లో ఇండియా లెజెండ్స్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన విండీస్ లెజెండ్స్ నిర్ణీత 20 ఓవర్ల లో 8 వికెట్ల నష్టానికి 150 పరుగులుచేసింది. ఓపెనర్లు చందర్ పాల్ (61),డారెన్ గంగ(32) మాత్రమే రాణించారు. ఇండియా లెజెండ్స్ బౌలర్ లలో జహీర్ ఖాన్ 2, మునాఫ్ పటేల్ 2,ప్రగ్యాన్ ఓఝా 2 వికెట్లు తీసుకోగా ఇర్ఫాన్ పఠాన్ ఓ వికెట్ పడగొట్టాడు. 
 
అనంతరం లక్ష్య ఛేదన లో బ్యాటింగ్ కు దిగిన ఇండియా లెజెండ్స్ కు టీమిండియా మాజీ ఓపెనర్లు సెహ్వాగ్ ,సచిన్  అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. సెహ్వాగ్ తన శైలికి తగ్గట్లు ఎదుర్కున్న మొదటి బంతికి ఫోర్ కొట్టి పాత రోజులను గుర్తుచేశాడు. సచిన్ కూడా తనదైన ట్రేడ్ మార్క్ షాట్ల తో అలరించాడు. అయితే 10ఓవర్ లో సచిన్ (36) క్యాచ్ అవుట్ కావడం తో వీరి భాగస్వామ్యానికి తెర పడింది. ఆతరువాత వచ్చిన కైఫ్, గోని త్వరగానే పెవిలియన్ చేరగా యువరాజ్ తో కలిసి సెహ్వాగ్ మ్యాచ్ ను పూర్తి చేశాడు. 57బంతుల్లో 11 ఫోర్ల తో సెహ్వాగ్ 74 పరుగుల తో అజేయంగా నిలువగా 7బంతులను ఎదుర్కొని ఓ సిక్సర్ తో 10పరుగులతో యువరాజ్ నాటౌట్ గామిగిలాడు. సెహ్వాగ్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది. ఈ సిరీస్ లో రెండో మ్యాచ్ ఆస్ట్రేలియా లెజెండ్స్ , శ్రీలంక లెజెండ్స్ మధ్య ఆదివారం ముంబై లో జరుగనుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: