భారత్ మహిళా క్రికెట్  జట్టు కీలక మ్యాచ్ లో చేతులేత్తిసింది . ఒత్తిడిని అధిగమించడం లో భారత్ మహిళలు పూర్తిగా విఫలమయ్యారు . ప్రపంచ కప్ సెమీస్ లో  భారత్ జట్టు ఒత్తిడి లో ఎలాగైతే ఓటమిపాలయి టోర్నీ నుంచి నిష్క్రమించిందో , అచ్చంగా భారత్ మహిళ జట్టు కూడా  టి - ట్వంటీ ప్రపంచ కప్ ఫైనల్ ఒత్తిడికి లోనయి అనవసర తప్పిదాలు చేసి ఓటమిపాలయింది . కీలక మ్యాచ్ లో ఫీల్డింగ్ లోపాలు జట్టు కొంప ముంచితే , బ్యాట్స్ విమెన్ల వైఫల్యం వెంటాడింది .

 

ఈ టోర్నీ లో సూపర్ ఫామ్ లో ఉన్న ఓపెనర్ షెపాలి వర్మ ను ఆసీస్ కట్టడి చేయడం లో సక్సెస్ అయింది . షెపాలి కేవలం రెండు పరుగులు చేసి అవుట్ కావడం జట్టు ఆత్మస్థర్యాన్ని దెబ్బతీసినట్లు కన్పించింది .  మరొక ఓపెనర్ స్మృతి మందాన కాసేపు మెరిసినా , క్రీజ్ లో నిలదొక్కుకుని కీలక ఇన్నింగ్స్ ఆడలేకపోయింది . ఈ టోర్నీ లో కెప్టెన్ హర్మాన్ ప్రీత్ కౌర్ ఆశించిన స్థాయి లో రాణించలేకపోయింది . ఇక ఫైనల్ లోను తన వైఫల్యాన్ని కొనసాగించింది . జట్టును ఆదుకోవాల్సిన హర్మాన్ ప్రీత్ ఫామ్ లేమితో ఇబ్బందిపడుతూ కేవలం నాలుగు పరుగులు చేసి వెనుతిరిగింది .

 

దీప్తి శర్మ నిలకడగా ఆడి 33 పరుగులు సాధించి ఒంటరి పోరాటం చేసిన ఫలితం లేకుండా పోయింది . ఫైనల్ లో ఆసీస్ బ్యాట్స్ విమెన్స్ రెచ్చిపోయారు . స్వేచ్ఛగా ఆడారు . భారత్ బౌలర్లపై తొలిఓవర్ నుంచే విరుచుకుపడ్డారు . అలిస్సా హీలి కేవలం 39 బంతుల్లోనే 75 పరుగులు  , బెత్ మూనీ 54 బంతుల్లో 78  పరుగులు నమోదు చేసి    భారత్ జట్టు ఓటమిని శాసించారు .   

మరింత సమాచారం తెలుసుకోండి: