ప్రస్తుతం దేశమంతటా కరోనా వైరస్ విజృంభిస్తున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ విధానాన్ని అమల్లోకి తీసుకొని రావడం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రజలు అందరూ కూడా ఇళ్లకే పరిమితం అయ్యారు. అంతేకాకుండా సినీ తారలు, క్రికెట్ ఆటగాళ్లు, రాజకీయ నేతలు ఇలా అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. ఇంకా కొంతమంది ఆటగాళ్లంతా ఇళ్లకు పరిమితమై కుటుంబ సభ్యులతో సంతోషంగా జీవనం చేస్తున్నారు. కొంతమంది అయితే ఇంట్లో పనులతో బిజీగా ఉంటున్నారు. 

 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

A “SWORD” MAY LOOSE IT’S SHINE,BUT WOULD NEVER DISOBEY IT’S MASTER. #rajputboy

A post shared by ravindra Jadeja (@royalnavghan) on

అసలు విషయానికొస్తే టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా మ్యాచ్ లలో అందర్నీ ఎలా మాయ చేస్తాడో అందరికీ తెలిసిన విషయమే. తన బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ లోనూ అద్భుతమైన విన్యాసాలు చేసి అభిమానులను ఆకర్షించుకుంటాయి. ఇప్పుడు ఇంట్లోనూ కూడా విన్యాసాలు చేస్తున్నాడు. ఇటీవల ఇంట్లో చేసిన కత్తి విన్యాసంతో అందర్నీ ఆకర్షించు కున్నాడు. జడేజా కత్తితో విన్యాసాలు చేసి ఆ వీడియోను సోషల్ మీడియా వేదికైన ఇంస్టాగ్రామ్ లో తన అభిమానులతో షేర్ చేసుకోవడం జరిగింది. ఇందుకు ఒక కాప్షన్ కూడా జత చేయడం జరిగింది. అది ఏమిటి అన్న విషయానికి వస్తే కత్తి తన మెరుపును కోల్పోవచ్చు కానీ గురువు మాటను కాదనను అని జడేజా తెలియజేస్తూ పోస్ట్ చేయడం జరిగింది.

 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

Throwback to this time last year to a commercial we were doing for @sunrisershyd Do you think I’ve got @royalnavghan covered for the sword?? 😂😂

A post shared by David Warner (@davidwarner31) on

ఈ పోస్టు చూసిన ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైకెల్ వాన్ కామెంట్ చేయడం జరిగింది. ఇక మరోవైపు ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ చాలా రోజుల క్రితం తాను పెట్టిన వీడియోలు ఇంస్టాగ్రామ్ లో కూడా పోస్ట్ చేయడం జరిగింది. అంతే కాకుండా నేను కూడా జడేజా లాగా బ్యాట్ తిప్పాను అంటూ నెటిజన్ల అభిప్రాయాలను అడిగాడు.   

మరింత సమాచారం తెలుసుకోండి: