ఐపీఎల్ పోరు రసవత్తరం గా సాగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రతి మ్యాచ్ కూడా ఎంతో ఉత్కంఠ భరితంగా సాగుతుంది. మ్యాచ్లో చివరి బంతి వరకు ఎవరు గెలుస్తారు అన్నది కూడా ప్రేక్షకుల ఊహకందని విధంగా ఉంది. అయితే ఈ ఏడాది కేఎల్ రాహుల్ సారథ్యంలో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు  రంగంలోకి దిగింది. ఈసారైనా కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు అద్భుతంగా రాణించి ప్లే ఆప్ కి అర్హత సాధించి ఫైనల్  వరకు వెళుతుందేమో  అని అభిమానులు ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. అయితే జట్టు సారథి కేఎల్ రాహుల్ అద్భుతంగా రాణించినప్పటికీ జట్టు ఆటగాళ్లు నుంచి సరైన మద్దతు లభించకపోవడం తో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు వరుస ఓటములు చవిచూసిన విషయం తెలిసిందే.



 దీంతో వరుస  ఓటములతో పాయింట్ల పట్టిక చివరన  ఎన్నో రోజులపాటు కొనసాగింది. దీంతో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు పని అయిపోయింది అని ఎంతో మంది విమర్శలు కూడా చేశారు. పేలవ  ప్రదర్శన చేయడంపై కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కిట్టు విమర్శలు ఎదుర్కొంది. కానీ ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా మారిపోయింది. మొన్నటి వరకు వరుస ఓటములతో విమర్శలు ఎదుర్కొన్న జట్టు ప్రస్తుతం వరుస విజయాలతో ప్రశంసలు అందుకుంటోంది. అంతేకాదు పాయింట్ల పట్టికలో పైపైకి ఎగబాకుతోంది. ప్రస్తుతం ప్లే ఆఫ్ ఆశలను  మరింత సుగమం చేసుకుంది కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు.



 దాదాపు వరుసగా ఐదు విజయాలను నమోదు చేసి  దృఢ సంకల్పం పట్టుదల ఉంటే సాధ్యం కానిది ఏదీ లేదు అని నిరూపించింది కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు. ప్లే ఆఫ్ ఆశలను సుగమం  చేసుకోవడానికి ప్రతి మ్యాచ్ కూడా పట్టుదలతో ఆడుతూ ఎంత భారీ టార్గెట్ ను అయినా సరే సునాయాసంగా చేధిస్తుంది కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కోల్కతా నైట్రైడర్స్ జట్ల మధ్య ఈ మ్యాచ్ జరుగగా ఎంతో సునాయాసంగా విజయం సాధించి పాయింట్ల పట్టికలో నాలుగవ స్థానానికి చేరుకుంది పంజాబ్ జట్టు.

మరింత సమాచారం తెలుసుకోండి: