ప్రస్తుతం కరోనా ప్రపంచ వ్యాప్తంగా ప్రభావం చూపుతుంటే..కరోనా రెండో వేవ్ కరోనా స్ట్రెయిన్ కూడా అంతే స్థాయిలో విజృంభిస్తుంది. ఇప్పటికే యూరప్ దేశాలలో ఈ కరోనా స్ట్రెయిన్ తీవ్రత చాలా అధికంగా ఉంది. ఈ కరోనా స్ట్రెయిన్ కేసులు వందల సంఖ్యలో నమోదు అవుతున్నాయి. మన దేశంలో కూడా కరోనా స్ట్రెయిన్ చాపాకింద నీరులా తన ప్రభావం చూపిస్తుంది. .

ఇదిలా ఉండగా ఇంగ్లాండ్ స్టార్ ఆల్ రౌండర్ మొయిన్ అలీ కరోనా స్ట్రెయిన్ బారిన పడ్డాడు. ఇటీవల ఇంగ్లాండ్ జట్టు 2 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం శ్రీలంక పర్యటనకు వచ్చింది. అయితే ఈ సీరిస్ ఎప్పుడో జరగాల్సి ఉన్న కరోనా కారణంగా వాయిదా వచ్చింది. అయితే ఇటీవల ఈ సిరీస్ కోసం లంకకు వచ్చిన ఇంగ్లాండ్ ఆటగాళ్లలో కరోనా పరీక్షలు నిర్వహించగా మొయిన్ అలీకి కరోనా పాజిటివ్ వచ్చింది.

 అయితే మొయిన్ అలీ కి లక్షణాలు కనిపిస్తుండడంతో వైద్యులు పరీక్షలు నిర్వహించగా అయితే అది కరోనా స్ట్రెయిన్ అని గుర్తించారు. ఇదిలా ఉండగా శ్రీలంకలో కరోనా స్ట్రెయిన్ ఇంత వరకు లేకపోగా ఒక విదేశీ క్రికెటర్ ద్వారా శ్రీలంక లో మొదటి కరోనా స్ట్రెయిన్ కేసు నమోదు కావడం గమనార్హం. మొయిన్ అలీతో సన్నిహితంగా ఉన్న మిగిత జట్టు సంభ్యులంధరికి కరోనా పరీక్షలు నిర్వహించగా నెగెటివ్ వచ్చింది. ఇదిలా ఉండగా ఇంగ్లండ్ జట్టు భారత్ లో టీమిండియాతో ఫిబ్రవరి లో కొన్ని మ్యాచ్ లు ఆడనున్న సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: