ఐపిఎల్ 14 పార్ట్ 2 లో బాగంగా ఈ రోజు జరగబోయే మ్యాచ్ అంత ఆసక్తికరమైనది కాకపోవచ్చు. ఇప్పటికే ప్లే ఆఫ్ రేస్ నుండి సన్ రైజర్స్ హైదరాబాద్ నిష్క్రమించిన విషయం తెలిసిందే. కానీ మిగిలిన జట్ల ప్లే ఆఫ్ అవకాశాలను దెబ్బ తీస్తుందని మాత్రం చెప్పగలం. అయితే రాజస్థాన్ రాయల్స్ ఇంకా ప్లే ఆఫ్ దాటి మూసుకుపోలేదు. మిగిలిన మ్యాచ్ లలో విజయం సాధిస్తే ప్లే ఆఫ్ కు చేరే అవకాశాలు మెండుగానే ఉన్నాయి.  అయితే ఈ మ్యాచ్ లో ఇరు జట్లకు గెలుపు అవకాశాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన జట్టు ముందుగా బ్యాటింగ్ ఎంచుకునే చాన్స్ ఉంది.  

ఎందుకంటే ఇక్కడ దుబాయ్ లో పిచ్ బ్యాటింగ్ కు అనుకూలిస్తుంది. కాబట్టి ముందుగా బ్యాటింగ్ చేసి చేజింగ్ టీమ్ ను ఒత్తిడిలో నెట్టే ప్రణాళిక చేసేందుకు చూసే అవకాశం ఉంది. ఇక ఇంతకు ముందు ఇరు జట్లు 14 సందర్భాల్లో కలిసి ఆడగా ఇద్దరు 7 మ్యాచ్ లు గెలిచారు. అంతే కాకుండా దుబాయ్ కి రెండు సార్లు ఈ టీమ్ లు తలపడగా చేరొక్క మ్యాచ్ లో గెలిచారు.  హైదరాబాద్ టీమ్ లో వార్నర్, విలియాంసన్ ఫామ్ లో లేకపోవడం మరియు బౌలింగ్ విభాగం కూడా వరుసగా విఫలమవుతున్నారు. ఇప్పటి వరకు వారు ఆడిన తొమ్మిది మ్యాచ్ లలో కేవలం ఒక మ్యాచ్ మాత్రమే గెలిచి ప్లే ఆఫ్ కు దూరమయ్యారు. ఎస్ ఆర్ హెచ్ లో ఉన్న సీనియర్ ఆటగాళ్లు అయిన కేదార్ జాదవ్, మనీష్ పాండే, సాహా లు కూడా రాణించడం లేదు. దీనితో యాజమాన్యానికి తలనొప్పిగా మారింది. బౌలింగ్ లో ఒక్క రషీద్ ఖాన్ ఒక్కడే ఆకట్టుకునే ప్రదర్శనలు చేస్తున్నాడు.

ఇక రాజస్థాన్ రాయల్స్ జట్టు విషయానికి వస్తే భారమంతా టాప్ ఆర్డర్ మీదనే పడుతోంది. ఓపెనర్లు మరియు శాంసన్ ఆడితే తప్ప ఇంకెవ్వరూ బ్యాట్ జులిపించలేకపోతున్నారు. బౌలింగ్ విభాగం పటిష్టంగా ఉన్నప్పటికీ బ్యాటింగ్ లో ఇంకా మెరుగవ్వాల్సి ఉంది.  ప్రస్తుతం పాయింట్ల పట్టీకలో 6 వ స్థానంలో కొనసాగుతోంది. ఇక మిగిలింది 5 మ్యాచ్ లే కావడంతో కనీసం నాలుగు ఖచ్చితంగా గెలిస్తే ఇతర జట్ల ఫలితాలను బట్టి ప్లే ఆఫ్ కు చేరే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ప్రతి మ్యాచ్ చావో రేవో లాగా ఆడాలి. మరి ఇంకాసేపట్లో జరగనున్న మ్యాచ్ లో రాజస్థాన్ గెలుస్తుందా ? గెలిచి ప్లే ఆఫ్ రేస్ లో నిలుస్తుందా చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: