ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా కొన్ని కొన్ని సార్లు ఆటగాళ్లు బౌండరీ లైన్ దగ్గర అబ్బురపరిచే క్యాచ్ లూ పట్టి ప్రేక్షకులందరినీ కూడా ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. కొన్నిసార్లు అద్భుతమైన ఫీల్డింగ్  చేస్తూ క్రికెట్ లవర్స్ ని ఆకట్టుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే అందరూ సిక్సర్లు ఫోర్లు వెళ్తాయని ఫిక్సయిపోయినా బంతిని కూడా మెరుపు ఫీల్డింగ్  తో ఆపుతూ ఉంటారు. ఇటీవలే పంజాబ్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో కూడా ఇలాంటి ఒక అద్భుతమైన ఫీల్డింగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారిపోయింది.


 ఢిల్లీ కాపిటల్స్ ఆటగాడు రోవ్మన్ పావెల్ సూపర్ ఫీల్డింగ్ తో ఆకట్టుకున్నాడు. చెప్పాలంటే పావెల్ ఫీలింగ్ తోనే మ్యాచ్ మొత్తం కీలక మలుపు తిరిగింది. ఆ తర్వాత పంజాబ్ కింగ్స్ జట్టు పై ఢిల్లీ క్యాపిటల్స్ ఏకంగా 17 పరుగుల తేడాతో విజయం సాధించింది. బెంగళూరు జట్టు వెనక్కినెట్టి నాలుగో స్థానంలోకి ఎగబాకింది. మ్యాచ్  ఉత్కంఠ భరితంగా సాగుతుంది. 17 ఓవర్లు ముగిసేసరికి పంజాబ్ జట్టు ఏడు వికెట్ల నష్టానికి 121 పరుగులు చేసింది.


 ఒక విజయం కోసం 18 బంతుల్లో 39 పరుగులు కావాలి. జితేష్ శర్మ అద్భుతమైన బ్యాటింగ్ ముందు అదంతా చిన్న లక్షమే. 18 ఓవర్ వేసాడు శార్దుల్ ఠాకూర్. లాంగాన్ మీదుగా భారీ షాట్ ఆడాడు  జితేష్. సిక్సర్ అని అందరూ ఫిక్స్ అయిపోయారు. కానీ బౌండరీ లైన్ దగ్గర ఫీల్డింగ్ చేస్తున్న పావెల్  గాల్లోకి ఎగురుతూ నమ్మశక్యం కాని రీతిలో ఆపాడు. దీనికి సంబంధించిన  పీక్స్ వైరల్గా మారిపోతున్నాయి. అదే ఓవర్ లో  వార్నర్ పట్టినా క్యాచ్ తో పెవిలియన్ చేరాడు జితేష్. ఆ తర్వాత వరుసగా బ్యాట్స్మెన్లు చేతులెత్తేయడంతో చివరికి 17 పరుగుల తేడాతో ఢిల్లీ జట్టు విజయం సాధించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl