ప్రతి ఏడాది లాగే ఈ ఏడాది కూడా సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు ఆట తీరు లో ఎలాంటి మార్పు రాలేదు. మెగా వేలం కారణంగా అన్ని ఫ్రాంచైజీలు స్టార్ ఆటగాళ్లను జట్టు లోకి తీసుకుని పటిష్టం గా మారితే అందరితో పాటు సమానం గా అవకాశాన్ని దక్కించుకున్న హైదరాబాద్ మాత్రం కొత్త ఆటగాళ్ళను తీసుకున్న అదృష్టం కలిసి రాలేదు. మళ్లీ అదే ఆట తీరుతో నిరాశ పరిచింది. ఈ క్రమం లోనే సన్రైజర్స్ ఆట తీరు పై మాజీ ఆటగాళ్లు  తీవ్ర స్థాయి లో విమర్శలు గుప్పించారు.


 ఈ క్రమం లోనే సన్రైజర్స్ జట్టు ప్రదర్శన పై స్పందించిన వీరేంద్ర సెహ్వాగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. గతం లో డేవిడ్ వార్నర్ పట్ల సన్రైజర్స్ వ్యవహరించిన తీరును తప్పు పట్టాడు వీరేంద్ర సెహ్వాగ్. డేవిడ్ వార్నర్ లాంటి ఆటగాడిని వదులుకొని సన్ రైజర్  పెద్ద తప్పు చేసింది అంటూ వ్యాఖ్యానించాడు. ఏం జరిగిందన్న విషయం సంబంధం లేకుండా వార్నర్ లాంటి ఆటగాడిని సన్ రైజర్  పెట్టుకోవాల్సింది. ఒకవేళ భారత ఆటగాడిని విషయం లో ఇలాంటి పరిస్థితి వస్తే అతని పక్కన పెట్టే వారు కాదు. జట్టు నుంచి తొలగించే వారు కూడా కాదు.


 యాజమాన్యం అతనికి అండగా ఉండి ఉంటే అతను తప్పకుండా సందడి చేస్తూ ఉండేవాడు. ఏదేమైనా వార్నర్ ను వదులుకున్న సన్రైజర్స్ పెద్ద తప్పు చేసింది అంటు వీరేంద్ర సెహ్వాగ్ వ్యాఖ్యానించాడు. ఒక సీజన్ సరిగ్గా ఆడనంత మాత్రాన ఒక ఆటగాడి పట్ల ఇంత దారుణం గా వ్యవహరించటం సరైనది కాదు. ప్రతి క్రికెటర్ కు గడ్డు పరిస్థితులు వస్తూ ఉంటాయి. అయినంత మాత్రాన బెంగళూరు జట్టు కోహ్లీని వదిలేయదు. వార్నర్ ఇప్పుడు ఢిల్లీ జట్టులో అద్భుతమైన ప్రదర్శన చేస్తూ  దూసుకు పోతున్నాడు అంటూ వ్యాఖ్యానించాడు వీరేంద్ర సెహ్వాగ్.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl