ప్రస్తుతం క్రికెట్ ప్రపంచం మొత్తం కూడా ఓకే మ్యాచ్ గురించి మాట్లాడుకుంటూ ఉంది. అదే ఎడ్జ్బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్ భారత్ మధ్య జరిగిన ప్రతిష్ఠాత్మకమైన ఐదో టెస్టు మ్యాచ్ గురించి. మొదట టీమిండియా జోరు చూసి ఈ మ్యాచ్లో టీమిండియా దే విజయం అని అందరూ భావించారు. కానీ ఆ తర్వాత మాత్రం ఊహించని విధంగా ఇంగ్లాండ్ జట్టు పుంజుకొని చివరికి విజయం సాధించింది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే సిరీస్ 2-2 తో సమయం అయ్యింది. ఐదవ టెస్ట్ మ్యాచ్లో గెలిచి చారిత్రాత్మకమైన విజయాన్ని సాధించాలి అన్న భారత ఆశలకు ఓటమితో గండి పడింది అని చెప్పాలి.


 అయితే 378 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ జట్టు కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి అటు లక్ష్యాన్ని ఛేదించింది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇంగ్లాండ్ విజయం నేపథ్యంలో ఇక ఈ టెస్ట్ మ్యాచ్లో పలు రికార్డులు నమోదయ్యాయి అని తెలుస్తోంది. ఇక ఆ వివరాల్లోకి వెళితే..

 టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో 132 పరుగుల ఆధిక్యం సాధించి ఓటమి పాలవ్వడం ఇది రెండోసారి కావడం గమనార్హం. 2015 లో గాలె వేదికగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో  భారత్ తొలి ఇన్నింగ్స్ లో 192 పరుగుల ఆధిక్యం సాధించింది. కానీ చివరికి ఓటమి తప్పలేదు.

 టీమిండియాపై ఇప్పటివరకు ఏ జట్టు కూడా ఇంత అత్యధిక పరుగుల చేదన చేయలేదు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.


 1977లో పెరు వేదికగా జరిగిన టెస్టులో ఆస్ట్రేలియా జట్టు టీమిండియాపై 339 పరుగులను టీమిండియాపై చేధించింది. ఇక ఇప్పటి వరకు ఇదే టీమిండియాపై అత్యధిక ఛేదన గా కొనసాగింది. కానీ ఇప్పుడు మాత్రం ఇంగ్లాండ్ జట్టు ఏకంగా 378 పరుగుల లక్ష్యాన్ని చేధించి  ఇక టీమిండియాపై అత్యధిక పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన జట్టుగా రికార్డు సృష్టించింది.

 ఇంగ్లాండ్ జట్టుకు టెస్ట్ క్రికెట్ లో ఇదే అత్యధిక ఛేదన కావడం గమనార్హం. 2019లో లీడ్స్ వేదికగా జరిగిన మ్యాచ్లో 259 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది ఇంగ్లాండ్. కానీ మొదటిసారి 378 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించి రికార్డు సృష్టించింది. ఇలా 5వ టెస్ట్ మ్యాచ్ లో పలు రికార్డులు నమోదయ్యాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: