ఇప్పటికే మొదటి వన్డే మ్యాచ్ లో 12 పరుగుల తేడాతో విజయం సాధించిన టీమిండియా ఇక రెండో వన్డే మ్యాచ్లో కూడా విజయం సాధించి ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే వన్డే సిరీస్ కైవసం చేసుకోవడంపై కన్నేసింది. ఈ క్రమంలోనే పక్క ప్రణాళికతో బరిలోకి దిగిన టీమిండియా ఇక విజయం దిశగానే అడుగులు వేస్తుంది అని చెప్పాలి. అయితే మొదటి వన్డే మ్యాచ్లో గట్టి పోటీ ఇచ్చిన న్యూజిలాండ్ ఇక రెండో వన్డేలో కూడా ఇలాంటి పోటీ ఇస్తుందని అందరూ అనుకున్నారు. కానీ టీమ్ ఇండియా బౌలింగ్ విభాగం దెబ్బకి ఇక బ్యాటింగ్ విభాగం విలవిలలాడిపోయింది అని చెప్పాలి.


 ఈ క్రమంలోనే అతి తక్కువ పరుగులు చేసి ఆలవుటయింది న్యూజిలాండ్ జట్టు. 34.3 ఓవర్లలో కేవలం 108 పరుగులు మాత్రమే చేసి ఆల్ అవుట్ అయింది అని చెప్పాలి. ఈ క్రమంలోనే స్వల్ప లక్ష్య చేదన కోసం అటు భారత జట్టు బరిలోకి దిగింది అని చెప్పాలి. అయితే లాస్ట్ మ్యాచ్లో సెంచరీ తో  చెలరేగిన బ్రాస్ వెల్ ఇక రెండో వన్డే మ్యాచ్లో మాత్రం 22 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. సీనియర్ బౌలర్ షమి తన ఫేస్కు పదును పెట్టి మూడు వికెట్లు పడగొట్టగా.. సిరాజ్, పాండ్యా, శార్దూల్ ఠాగూర్లు తలో వికెట్ సాధించారు అని చెప్పాలి. ఈ క్రమంలోని న్యూజిలాండ్ ఒక చెత్త రికార్డు నమోదు చేసింది.



 టీమిండియా తో రెండో వన్డే మ్యాచ్లో 15 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయిన కేవీస్ కు ఇక ఇదే అత్యల్ప స్కోర్ కావడం గమనార్హం. ఇంతకుముందు 2001లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో 18 పరుగులకు ఐదు వికెట్లు కోల్పోయింది. 2010లో బంగ్లాతో మ్యాచ్లో 20 పరుగులకు ఐదు వికెట్లు, 2003లో ఆస్ట్రేలియాపై 21 పరుగులకు ఐదు వికెట్లు కోల్పోయింది కివిస్ జట్టు. ఇక ఇటీవల ఇండియాతో జరిగిన రెండవ మ్యాచ్లో కేవలం 15 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి దారుణమైన ప్రదర్శన చేసింది అని చెప్పాలి. ఇలా 15 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి ఒక చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకుంది న్యూజిలాండ్ జట్టు.

మరింత సమాచారం తెలుసుకోండి: