
Nokia X30 5g స్మార్ట్ ఫోన్ ధర రూ.48,999.. ఈ ఫోన్ ఐస్ వైట్ బ్లాక్ క్లౌడ్, బ్లూ వంటి రెండు కలర్ ఆప్షన్లలో మీరు కొనుగోలు చేయవచ్చు. అంతేకాదు ఈ ఫోన్ నోకియా స్టోర్ లేదా అమెజాన్ నుండి కూడా అమ్మకానికి అందుబాటులోకి వచ్చింది . ప్రస్తుతం ప్రీ ఆర్డర్స్ కి మాత్రమే అందుబాటులో ఉంది కాబట్టి ఈ ఫోన్ త్వరలోనే అందరికీ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని నోకియా స్పష్టం చేసింది. ఇకపోతే ఈ ఫోన్ తో పాటు నోకియా కంఫర్ట్ ఇయర్ బర్డ్స్ అలాగే 33W ఫాస్ట్ చార్జర్ ని కూడా ఉచితంగా కంపెనీ ఆఫర్ చేస్తోంది.
స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే 6.43 ఇంచ్ ఫుల్ హెచ్డి ప్లస్ అమౌలెడ్ డిస్ప్లేను కలిగి ఉంటుంది. 90 హెడ్జెస్ రిఫ్రెష్ రేటుతో ఈ స్మార్ట్ ఫోన్ లభిస్తుంది. కాబట్టి రక్షణ కోసం పైన గొరిల్లా గ్లాస్ విక్టర్స్ ని కూడా కంపెనీ అందిస్తోంది. ఈ ఫోన్ 4200ఎంఏహెచ్ బ్యాటరీని కలిగి ఉంది. కెమెరా విషయానికి వస్తే 50 ఎంపీ ప్రధాన కెమెరా సెన్సార్లు కలిగి ఉన్నాయి. సెల్ఫీ కోసం ఫ్రంట్ 16 కెమెరా కూడా అమర్చబడి ఉంది. ఆండ్రాయిడ్ 12 ఓఎస్ పై ఈ స్మార్ట్ ఫోన్ పనిచేస్తుంది.