టెక్నాలజీ ప్రస్తుతం బాగా డెవలప్ అవ్వడంతో ప్రస్తుతం మార్కెట్లోకి ఇంధనంతో నడిచే వాహనాల కంటే ఎలక్ట్రిక్ వాహనాలు బాగా ఎక్కువగా నడుస్తోంది.. పెట్రోల్, డీజిల్ ధరలు మండిపోతున్న క్రమంలో ఎక్కువగా ఎలక్ట్రిక్ వాహనాల వైపు మక్కువ చూబుతున్నారు ప్రేక్షకులు. కాగా విద్యుత్ శ్రేణిలో బస్సులు, కార్స్, బైక్స్ స్కూటర్స్ మాత్రమే వచ్చాయి..కానీ ఇప్పుడు సైకిల్స్ కూడా పెద్ద ఎత్తున మార్కెట్లోకి విడుదల కాబోతున్నాయి.


తక్కువ దూరాలకు వ్యాయామ పరమైన వాటికి ఈ ఎలక్ట్రిక్ సైకిల్ ను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు.. ఈ ఎలక్ట్రిక్ సైకిల్ వల్ల ఆరోగ్యంతో పాటు సౌకర్యాన్ని కూడా అందిస్తున్నాయి. ఇటీవల కాలంలో వీటి వినియోగం ప్రతిరోజు పెరుగుతూనే ఉంది. ఈ క్రమంలోని మై బైక్ అనే ఒక కంపెనీ రెండు కొత్త ఎలక్ట్రిక్ సైకిల్ లను ఇండియాలో లాంచ్ చేయడం జరిగింది. ఈ కంపెనీ స్టేషన్ ఆధారిత సైకిల్ షేరింగ్ రేటింగ్ సర్వీసులను కూడా నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.. ఈ సైకిల్ ఇప్పుడు మనదేశంలో కూడా విడుదల అయింది.

మై బైక్ ఎలక్ట్రిక్ మై బైక్ ఎలక్ట్రిక్ కార్గో పేర్లతో రెండు సైకిళ్ళను ఆవిష్కరించింది.. మై బైక్ ఎలక్ట్రిక్  సైకిల్ టూరిస్టుల కోసం డిజైన్ చేశారు. ఎలక్ట్రిక్ కార్గో సైకిల్ వర్కర్ల యొక్క  డెలివరీ  కష్టాలను తీర్చేందుకే తీసుకువచ్చినట్లుగా తెలియజేశారు.ఈ బైక్ యొక్క ఫీచర్ల విషయానికి వస్తే.. ఈ బ్యాటరీ కి అన్ లాకింగ్ సదుపాయాలు కూడా కలవు.. పరిస్థితులను బట్టి 80 -100 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది..0.54 KWH సామర్థ్యం గల స్వాపబుల్ బ్యాటరీ ఉంటుందట. ఆరోగ్యంతో పాటు దూర ప్రయాణాలు కూడా చేయవచ్చు. ఆరోగ్యం కోసం ప్రత్యేకమైన పెడల్లు కూడా తయారు చేశారు అలాగే దూరం వెళ్లడానికి స్కూటర్ లాగా కూడా వినియోగించుకోవచ్చు. ప్రయాణం చేసేటప్పుడు తక్కువ వేగంతో నడిచే ఎలక్ట్రిక్ స్కూటర్ల ఉపయోగపడుతుందని కంపెనీ తెలియజేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: