
స్మార్ట్ మొబైల్ పేలడానికి అత్యంత ముఖ్య కారణం బ్యాటరీ లోపమే ఈ స్మార్ట్ మొబైల్ ఫోన్లలో బ్యాటరీలు లియాన్తో రూపొందించబడతాయి.. కనుక ఇవి కెమికల్ బ్యాలెన్స్ ను కలిగి ఉంటాయి వీటి దగ్గర వేడి పెరిగినప్పుడు లేదా బ్యాటరీ లోపల కేసింగ్ దెబ్బతిన్నట్లు అయితే స్మార్ట్ మొబైల్ వేరే అవకాశాలు ఎక్కువగా ఉంటాయట. స్మార్ట్ మొబైల్ లో ఉండే బ్యాటరీలు హీట్ అవుతున్నాయి అంటే చాలా ప్రమాదంగా గుర్తించుకోవాలట. ముఖ్యంగా వేడి ఉండే ప్రదేశాలలో మొబైల్ ఛార్జింగ్ చేయడం చార్జింగ్ వైరు పెట్టి అలాగే ఉంచడం వంటివి చేయకూడదు. మొబైల్ ఛార్జింగ్ చేసేటప్పుడు కాల్స్ వంటివి అసలు ఉపయోగించకూడదు.
చార్జింగ్ ముగిసిన తర్వాత కూడా అలాగే ఉంచితే బ్యాటరీ హిటెక్కి చాలా త్వరగా ఉబ్బిపోతుంది. ఇలా ఉబ్బిన బ్యాటరీలు ఎక్కువగా పేలే అవకాశం ఉంటాయట.ఉబ్బిన బ్యాటరీలను వెంటనే గమనించి వాటిని మార్చివేయాలి.. మొబైల్ చేతిలో నుండి కింద పడిపోయినప్పుడు బ్యాటరీ ఉబ్బినట్లు అనిపిస్తే దానిని మార్చి వేయాలి.. స్మార్ట్ మొబైల్ లో కనిపించే డ్యామేజిల్ లేనప్పటికీ ఫోన్ తరచుగా కింద పడితే చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. మొబైల్స్ కింద పడినప్పుడు బ్యాటరీలు దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఎక్కువగా కంపెనీ చార్జింగ్ లను వాడుతూ ఉండాలి.