ఇంటింటి గృహలక్ష్మి.. ఈ సీరియల్ రోజుకో మలుపు తిరుగుతోంది.. తన భర్త వేరే మహిళ తో ఉన్నాస్ కూడా సహిస్తూ వస్తుంది..ఇంకా చెప్పాలంటే.. తన మాంగళ్యాన్ని వేరేలా ఆడదానికి ఇచ్చి అందరి చేసే శభాష్ అనిపించుకుంది.. ఇకపోతే నిన్నటి ఎపిసోడ్ లో లాస్య ఏం చేసినా అత్త సపోర్ట్ చేసేది.. కానీ లాస్య మాజీ భర్త తో చాటుగా మాట్లాడుతుంది. విషయాన్ని గమనించిన తులసి లాస్యకి బుద్ది చెప్తుంది. ఈరోజు ఎపిసోడ్ లో మరో ట్విస్ట్ జరుగుతుంది.. దాంతో కోపంతో రగిలి పోయిన తులసి లాస్య చెంప చెళ్లుమనిపించిన పని చేస్తుంది..



లాస్య, భాగ్యలు కలిసి కుట్రకు మరోసారి ప్లాన్ చేసుకుంటారు. ‘ఇంట్లో సగం భాగం నాకు వచ్చేలా నువ్వు చెయ్యి.. తులసి ఇంట్లోంచి వెళ్లిపోయేలా నేను చేస్తాను. బావగారు నువ్వు ఒకటి అయ్యేలా ప్లాన్ చేస్తాను’ అంటూ డీల్ కుదుర్చుకుంటుంది భాగ్య లాస్యతో. సీన్ కట్ చేస్తే.. ఇంటి పనిమనిషి రాములమ్మతో.. లాస్య.. ‘ఏయ్.. నందుకి టిఫిన్ రెడీ చెయ్యి’ అని పొగరుగా చెప్పడం, రాములమ్మ కోపంగా అడ్డమైన వాళ్ళు చెబితే నేను ఎందుకు వింటాను తులసి అమ్మ చెబితే వింటాను అని సమాధానం ఇస్తుంది.. ఈ విషయం పై అనసూయ మరోసారి రచ్చ చేస్తుంది..



చూడు లాస్య.. యజమానులమనే పొగరు పని వాళ్ల దగ్గర చూపిస్తే మన పరువు మనమే పోగొట్టుకోవడం అవుతుంది. నెమ్మదిగా చెప్పి చేయించుకోవడం నేర్చుకో’ అని చెప్పి వెళ్లిపోతుంది. ఇంతలో కాలింగ్ బెల్ మోగడంతో.. లాస్య వెళ్లి డోర్ తీస్తుంది. తలుపు తీసేసరికి తన భర్త శేఖర్ ఉండటంతో.. షాక్ అయ్యి బయటికి దూరంగా లాక్కెళ్లి.. ‘నీకు డబ్బులు నేనే తీసుకొచ్చి ఇస్తాను.. ఇక్కడ నుంచి వెళ్లిపో.. ఎవరైనా చూస్తే పెద్ద గొడవ అయిపోతుంది.. ఆ విషయాన్ని తులసి చూస్తుంది.నువ్వు రెండు పడవల మీద ప్రయాణం చేస్తున్నావ్ లాస్య.. అది చాలా ప్రమాదకరం.



నీతో పాటు ఆయన కూడా ఒక గమ్యం లేని ప్రయాణం చేస్తున్నారు.. నీ వల్ల ఆయనకి ఎప్పుడైనా ఎలాంటి ముప్పైనా వచ్చే అవకాశం ఉంది. కానీ ఎప్పుడైనా నీ మూలంగా ఆయనకి ఏదైనా సమస్య రావాలి.. అప్పుడు ఊరుకునేది లేదు.. శేఖర్ నీ కోసం రావడం అనే విషయం నా కంట పడింది ..అంటుంది తులసి..అందుకు లాస్య నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావ్ తులసి ఆయనకి నువ్వు దగ్గర కావడం కోసం.. నన్ను ఆయన్ని దూరం చెయ్యడం కోసం.. నీ ప్రయత్నాలు ఆపమంటున్నాను..’ అనడంతో లాస్య షాక్ అవుతుంది. మరో రేపటి ఎపిసోడ్ లో ఎలా ఉంటుందో సోమవారం చూడాల్సిందే..

మరింత సమాచారం తెలుసుకోండి: