బిగ్ బాస్ ద్వారా చాలా మంది ఫేమస్ అవుతున్నారు.. ముఖ్యంగా చెప్పాలంటే కొత్త సినిమా అవకాశాలను అందుకుంటున్నారు. నాలుగో సీజన్ లో పాల్గొన్న వాళ్ళు మాత్రం మాములుగా ఫేమస్ అవ్వలేదు. ఇటు సినిమాల లో నటించే అవకాశాలు.. అటు షో లలో సందడి చేస్తున్నారు.బిగ్ బాస్ విన్నర్ అభిజిత్ మాత్రం కెరియర్ ను మరింత కలర్ఫుల్ గా మార్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.కెరీర్ ఆరంభంలోనే వరుస పెట్టి పలు చిత్రాల్లో నటించాడు. కానీ, అంతగా గుర్తింపును మాత్రం దక్కించుకోలేకపోయాడు.


ఇలాంటి పరిస్థితుల్లో బిగ్ బాస్ నాలుగో సీజన్‌లోకి ఎంట్రీ ఇవ్వడం తో అతడి ఫాలోయింగ్ అమాతం పెరిగిపోయింది. ఈ కారణం గానే ఈ సీజన్‌ కు విజేతగా నిలిచాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు తన సినిమాకు సంబంధించిన ప్రకటన మాత్రం చేయలేదతను. ఈ నేపథ్యం లో అభిజీత్ మూవీ ఆలస్యం అవడానికి అసలు సీక్రెట్ లీక్ అయింది.. ఇకపోతే డైరెక్టర్ శేఖర్ కమ్ముల రూపొందించిన 'లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్' అనే సినిమా తో అభిజీత్ హీరోగా పరిచయం అయ్యాడు. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆడలేదు.
 

తర్వాత 'రామ్ లీలా', 'మిర్చి లాంటి కుర్రాడు' వంటి చిత్రాల్లో నటించినా.. అతడికి హిట్ మాత్రం దక్కలేదనే చెప్పాలి. అయితే, వర్షిణి తో కలిసి అభిజీత్ చేసిన 'పెళ్లి గోల'  భారీగా యువతను ఆకట్టుకుంది.. గత కొద్ది రోజులుగా రోజలుగా అభిజీత్ చాలా కథలను వింటున్నాడు. దీనికి సంబంధించిన అప్‌డేట్లను కూడా సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్‌తో పంచుకుంటున్నాడు. ఈ క్రమంలోనే అతడు పలానా సినిమాలో భాగం అయ్యాడని.. పలానా దర్శకుడి తో సినిమా చేయబోతున్నాడని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో అతడి సినిమా ఆలస్యం అవడానికి కారణంగా చెప్పవచ్చు.. మరి ఈ సినిమా తో అయిన హిట్ టాక్ ను సొంతం చేసుకుంటాడెమో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: