రోజు ఉదయం లేవగానే  పేపర్ అంటూ పేపర్ బాయ్ వచ్చి  న్యూస్ పేపర్ వేసి వెళ్లే పరిస్థితులు మారాయి. కరోణ కాటుతో  ప్రజలంతా న్యూస్ పేపర్లు  చదవడం మానేసి  ఆన్ లైన్ వార్తలకే  ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తున్నారు . దీంతోపాటుగా  న్యూస్ పేపర్ యాజమాన్యాలు కరోణతో  చాలా వరకు తమ పేపర్లను తగ్గించేశాయి. ఎందుకంటే ప్రింటింగ్ ఖర్చు  నిర్వహణ బాధ్యతలు, ఆ పేపర్ ను కస్టమర్ కు చేసేసరికి ఖర్చులు చాలా అవుతున్నాయి. దీంతో  యాజమాన్యాలు కూడా పేజీలు తగ్గించుకోవడం , కొన్ని యాజమాన్యాలు  పూర్తిగా మూతపడడం  జరిగింది.

 దీంతో పాటుగా చాలామంది  ప్రతి న్యూస్ ను ఆన్లైన్లో చూడడం అలవాటు చేసుకున్నారు. దీంతో న్యూస్ పేపర్ లకు ఉండే ఆదరణ చాలా వరకు తగ్గింది. దీంతో  చాలామంది పేపర్లపై బతికేవారు రోడ్డున పడ్డారు అని చెప్పవచ్చు. పేపర్ బాయ్ నుంచి మొదలు పాత న్యూస్ పేపర్ కొనే వారి వరకు  వీరంతా ఆన్లైన్ న్యూస్ పెరగడంతో  పనులు లేక  కుటుంబాన్ని పోషించడానికి సతమతమవుతున్నారు. అంటే కరోనా వైరస్ కు ముందు  న్యూస్ పేపర్ వేసుకునే వారి సంఖ్య చాలా ఎక్కువగా ఉండే దని, దీంతో పాత పేపరు కొనేవారు రోజుకు 50 కిలోల వరకు న్యూస్ పేపర్ కొనుక్కొని దానిద్వారా లాభార్జన చేసుకునేవారు. ప్రస్తుత పరిస్థితుల్లో మాత్రం పాత పేపర్ కొనే వారు పొద్దంతా తిరిగినా  5 కిలోలు కూడా రావడంలేదని అంటున్నారు. దీనికి ప్రధాన కారణం  జనాలు ఎవరు కూడా న్యూస్ పేపర్ ను  వేసుకోవడం లేదని అర్థం చేసుకోవచ్చు. ప్రతి వార్తను ఆన్లైన్ ద్వారా చదువుతున్నారని ఈ విషయాన్ని చూస్తే అర్థమవుతుంది. ప్రస్తుత కాలంలో  టెక్నాలజీ పెరగడం ప్రతి ఒక్కరు చేతిలో మొబైల్ ఫోన్ ఉండడం  ఏదైనా సంఘటన జరిగితే క్షణాల్లో అది జనాల్లోకి వెళ్లిపోవడం జరుగుతోంది. దీని ద్వారా న్యూస్ పేపర్లను, చదవడం గానీ, వాటిని వేసుకోవడం గాని చాలావరకు తగ్గించారని చెప్పవచ్చు. ప్రపంచ నలుమూలల నుంచి ఏం జరిగినా క్షణాల్లో అందించే ఆన్లైన్  న్యూస్ లకు ప్రస్తుత తరుణంలో ఆదరణ ఎక్కువగా పెరిగింది.

ప్రస్తుతం ఉన్న కొన్ని ప్రముఖ పేపర్లు వాటి యొక్క పేపర్ల పేజీలు తగ్గించి  వెబ్ న్యూస్ కి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారని, రాబోవు కాలంలో పేపర్ చదివేవారు మొత్తానికి ఉండకపోవచ్చని, ఆన్లైన్ న్యూస్ చదివే వారే ఎక్కువ అవుతారని మనకు తెలుస్తోంది. పేపర్  ఆదరణ తగ్గడం  వీటిపై ఆధారపడి బ్రతుకుతున్న అటువంటి కొంతమంది కార్మికుల పై దెబ్బ  పడ్డ జనాలకి మాత్రం చాలా సులభంగా  ఉన్నదని చెప్పవచ్చు. ఎందుకంటే  ఎంత పెద్ద సంఘటన అయినా క్షణాల్లో జనాల్లోకి వెళ్లిపోవడం, ఆ సమస్య సాలువు కావడం జరుగుతోంది. అందుకనే  ప్రజలు ఎక్కువగా ఆన్లైన్ న్యూస్ పై ఫోకస్ పెడుతున్నారని అర్థమవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: