ఈ రోజుల్లో సైబ‌ర్ దాడులు ఎక్కువ అయిపోయాయి. సామ‌న్య ప్ర‌జ‌ల నుంచి పోలీస్ స్టేష‌న్లు తో పాటు ఏకంగా యూ ఎన్ ఓ కార్యాల‌యం పై కూడా సైబ‌ర్ దాడులు జ‌రుగుతున్నాయి. ఇటీవ‌ల యూఎన్ఓ కార్యాల‌యం పై సైబ‌ర్ నెర‌స్థులు దాడి చేయ‌డం యావ‌త్ ప్ర‌పంచాన్ని ఆశ్చ‌ర్య ప‌రిచింది. అయితే ప్ర‌పంచ సంస్థ‌ల‌నే వెంటాడుతున్న సైబ‌ర్ నేర‌గాళ్ల నుంచి బ్యాంక్ ఖాతాదారులు జ‌గ్ర‌త్త గా ఉండాల‌ని మ‌న దేశ సైబ‌ర్ సెక్యూరీటి ఏజెన్సీ వారు హెచ్చ‌రిక‌లు చేస్తున్నారు. కొంచం యాద మ‌రిచినా మ‌న బ్యాంక్ లో ఉన్న డ‌బ్బు ల‌ను లూటీ చేసే ప్ర‌మాదం ఉంద‌ని వారు హెచ్చ‌రిస్తున్నారు.




సైబ‌ర్ నేర‌గాళ్లు బ్యాంక్ ఖాతాదారులను టార్గెట్ చేసి వారి స‌మాచారం దొంగలించేలా ప్ర‌ణాళిక వేస్తున్నారు. దీని కోసం మాల్ వేర్ అనే దానికి వాడుతున్నారు. ఈ మాల్ వేర్ గతంలో డ్రినిక్ మాల్ వేర్ అని కూడా పిలుస్తారు. గ‌తం లో డ్రినిక్ మాల్ వేర్ ఎస్ ఎం ఎస్ ల‌ను దొంగ‌లించ‌డానికి ఉప‌యోగించేవారట‌. అయితే దాన్ని కాస్త డెవ‌ల‌ప్ చేసి బ్యాంక్ ఖాతాదారుల స‌మాచారాన్ని తెలుసుకుంటున్నారు. ఇప్ప‌టి కే ప‌లు ప్ర‌ధాన ప్ర‌భుత్వ, ప్ర‌యివేటు రంగ బ్యాంకు ల‌తో పాటు మ‌రో 27 కు పైగా భార‌తీయ బ్యాంక్ ల వినియోదారుల‌పై మాల్ వేర్ ను ఉప‌యోగించి సైబ‌ర్ దాడి చేయ‌డానికి సిద్ధం గా ఉంద‌ని సైబ‌ర్ సెక్యూరీటి ఏజెన్సీ వారు త‌మ నివేదిక తెలిపారు.



ఈ మాల్ వేర్ అనేది ప్ర‌భుత్వ రంగ సంస్థ లైనా ఆదాయ‌పు శాఖ తో పాటు ప‌లు ర‌కాలైనా భార‌త‌ ప్ర‌భుత్వ అధికార వెబ్ సైట్ ల నుంచి ఎస్ ఎమ్ ఎస్ వ‌స్తుంది. దీనిపై ఖాతాదారుల వ్య‌క్తి గ‌త స‌మాచారం న‌మోదు చేసి ఒక APK యాప్ ను డౌన్ లోడ్ చేసుకొమ్మ‌ని వ‌స్తుంది. దీన్నిడౌన్ లోడ్ చేసుకుంటే.. మ‌న ఆండ్రాయిడ్ మొబైల్ నుంచి ఈ యాప్ కు కోన్ని అనుమ‌తుల‌ను కొరుతుంది. అలాగే మ‌న వివ‌రాల‌తో పాటు బ్యాంక్ అకౌంటు నంబ‌ర్, ఫోన్ నెంబ‌ర్ అడుగుతుంది. మ‌నం చివ‌రికి ఉన్న క్లిక్ బ‌ట‌న్ ప్రెస్ చేస్తే మ‌న బ్యాంక్ ఖాతా పూర్తి వివ‌రాలు సైబ‌ర్ నెర‌గాళ్లకు వెళుతుంది. వీటితో మ‌న బ్యాంక్ లో ఉన్న న‌గ‌దును దొంగ‌లించే ప్ర‌మాదం ఉంది. అందు చేత అనుమానం ఉన్న ఫోన్ కాల్స్, ఎస్ ఎమ్ ఎస్ ల‌కు స్పంధించ‌క పోవ‌డ‌మే ఉత్త‌మం అని సైబ‌ర్ సెక్యూరీటి ఏజెన్సీ వారు హెచ్చ‌రిస్తున్నారు.




మరింత సమాచారం తెలుసుకోండి: