సాధారణంగా చిన్న పిల్లలు అన్న తర్వాత అల్లరి చేయడం సహజం. అంతేకాదు ఇక ఎవరు పక్కన లేకున్నా ఎదో ఒక వస్తువు తో ఆడుకుంటూ ఉంటారు చిన్నపిల్లలు. ఇలా చిన్న పిల్లల ఆట లో మునిగిపోయారు అంటే చుట్టుపక్కల అసలు ఏం జరుగుతుంది అన్న విషయాన్ని కూడా అస్సలు పట్టించుకోరు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ముంచుకు వచ్చే ప్రమాదాలను కూడా పసిగట్ట లేక చివరికి ప్రాణాల మీదికి తెచ్చుకుంటు ఉంటారు కొన్నిసార్లు. అందుకే చిన్న పిల్లలు ఆడుకునేటప్పుడు తల్లిదండ్రులు కాస్త ఒక గంట కనిపెట్టడం ఎంతో బెటర్ అని సూచిస్తూ ఉంటారు నిపుణులు. ముఖ్యంగా సైకిల్ రైడింగ్ సమయంలో చిన్నారులు తెలిసీ తెలియని వయసులో కాస్త నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారు.


 ఇక చిన్నారులు తెలిసీ తెలియక చేసిన పని చివరికి ప్రాణాలు కోల్పోయే పరిస్థితి తీసుకు వస్తూ ఉంటుంది అని చెప్పాలి. ఇప్పుడు ఇలాంటి తరహా వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ చక్కెర్లు కొడుతుంది అని చెప్పాలి. అందరు పిల్లల్లాగానే ఇక్కడ ఒక చిన్నారి కూడా సైకిల్ పై అటు ఇటు తిరుగుతూ ఆడుకుంటూ ఉంది. ఇలాంటి సమయంలోనే ఒక్కసారిగా ప్రమాదం బారిన పడేది. కానీ రెప్పపాటు కాలంలో అక్కడ ఉన్న వ్యక్తులు ఆ చిన్నారిని రక్షించారు. లేకపోతే చివరికి తల పగిలి ప్రాణాలు పోయేవి అని చెప్పాలి.


 ఈ క్రమంలోనే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్విట్టర్ వేదికగా వైరల్ గా మారిపోయిన ఈ వీడియో చూసి ప్రతి ఒక్కరు అవాక్కవుతున్నారు అనే చెప్పాలి.  ఇక ఈ వీడియోలో చూసుకుంటే రోడ్డు పక్కన ముగ్గురు పెద్దవారు ఒక బాలుడు నిలబడి ఉన్నారు. ఈ క్రమంలోనే వారి పక్కన  ఒక పొడవాటి స్తంభం కూడా ఉంది. చిన్నారి రోడ్డు దాటే క్రమంలో సైకిల్పై వేగంగా దూసుకు వచ్చింది.  కానీ ఆ చిన్నారి ముందున్న స్తంభాన్ని మాత్రం గమనించలేకపోయింది. ఇది గమనించిన ఫుట్పాత్ పై ఉన్న వ్యక్తి వేగంగా వెళ్లి బాలికను పట్టుకున్నాడు. తద్వారా ఆ బాలిక చిన్న గాయాలతో బయటపడింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: