గోదావరి జిల్లాలంటే మర్యాదలకు మారు పేరు అని తెలుగు రాష్ట్రాల్లో అందరూ చెబుతారు. సంక్రాంతి పండుగ వస్తే చాలు ఆంధ్రప్రదేశ్‌లోని పల్లెలన్నీ కళకళలాడుతాయి. ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో పల్లెలైతే కోడి పందేలు, పండగ శోభతో మరింత వెలిగిపోతుంటాయి. గోదావరి జిల్లాలు అంటే మర్యాదకు మారు పేరు. అప్పుడెప్పుడో మర్యాద రామన్న సినిమాలో చూపించినట్టు మర్యాదలో రాయలసీమతో పాటు గోదావరి జిల్లాల్లో కూడా చాలా ఎక్కువగానే ఉంటాయి. మర్యాదల విషయంలో చాలా ప్రత్యేకత కూడా ఉంది.


ఇక గోదావరి జిల్లాలకు కొత్త అల్లుడు అంటే ఇక మర్యాదల విషయంలో ఎక్కడా తగ్గరు. ప్రేమతో, అభిమానంతో కడుపు నింపేస్తారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో సంక్రాంతి పండుగ సందర్భంగా ఇంటికి వచ్చిన కొత్త అల్లుడికి ఓ అత్త తన చేతివాటం చూపించింది.తాజాగా సంక్రాంతికి ఇంటికి వచ్చిన అల్లుడికి అత్తింటి వారు ఏకంగా 125 రకాల వంటలు వడ్డించారు. ఆ వంటకాలు అన్నీ సర్దడానికే డైనింగ్ టేబుల్ మొత్తం సరిపోయింది. ఆ 125 రకాల్లోనూ అన్ని టేస్ట్‌లు ఉండేలా చూసుకున్నారు. పక్కన కూతుర్ని కూర్చోపెట్టింది. ఇక, ఆ అల్లుడి పరిస్థితి ఊహించండి.


వంటలన్నీ తినెయ్యాలన్న కోరిక ఉన్నా, అన్నీ తింటే ఇంకేమైనా ఉందా.స్వీట్, హాట్, పండ్లు, బర్గర్లు, రకరకాల కూరలు, రకరకాల రైస్‌లు అన్నీ వరుసగా అల్లుడి ముందు పెట్టారు. వెజ్, నాన్ వెజ్ అన్నీ పెట్టారు. అవన్నీ ఒక్కొక్కటి టేస్ట్ చేసినా కూడా కడుపు నిండిపోయేంతగా ఉన్నాయి. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.తనకు అన్ని రకాల ఫుడ్ పెట్టిన అత్తింటి వారి ప్రేమకు ఆ అల్లుడు ఫిదా అయినట్టు ఉన్నాడు. తన భార్యకు కూడా కొంచెం టేస్ట్ చేయమంటూ స్పూన్‌తో అందించాడు. కానీ, నాకొద్దు అంటూ ఆమె తినలేదు. ఈ వీడియో పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో జరిగినట్టు తెలిసింది .కానీ అత్తింటివారు చూపించిన అభిమానానికి ఆ అల్లుడు ఎంత ఎగ్జైట్ అవుతున్నాడో అతడి కళ్లలో కనిపిస్తోంది.






గోదావరి జిల్లాలంటే అందరికీ గుర్తొచ్చేది అతిథులకు చేసే మర్యాదలు. ఇక ‘సంక్రాంతి’ అల్లుళ్ల సంగతి చెప్పేదేముంది? రకరకాల వంటలు ముందు పెట్టి అల్లుళ్ల పొట్టలతో ‘ఫుడ్‌ బాల్’ ఆడేస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి: