ఈ కరోనా విపత్కర పరిస్థితుల్లో మహమ్మారి నుంచి తప్పించుకోవాలంటే మాత్రం తప్పకుండా కొవిడ్19 వ్యాక్సిన్ వేయించుకోవాల్సిందే.ఈ వ్యాక్సిన్ వేయించుకున్న తరువాత కొందరిలో కొంతవరకు యాంటీబాడీలు ఉత్పన్నమైతే, మరికొందరిలో చాలా ఎక్కువ ఉత్పత్తి అవుతున్నాయి. అయితే కొవిడ్-19 వ్యాక్సినేషన్ తర్వాత  కొందరిలో ఆరోగ్య సమస్యలు ఏర్పడుతున్నాయి. ఇటీవల కాలంలో వ్యాక్సిన్ వేయించుకున్న తర్వాత కొందరికి సైడ్ఎఫెక్ట్స్ వస్తే, వ్యాక్సిన్ బాగా పని చేసినట్టే అని అంటున్నారు. అయితే ఇందులో ఎంత వరకూ నిజం వుందో అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం..


సాధారణంగా కొవిడ్-19 టీకా వేయించుకున్న తర్వాత చాలా మందిలో జ్వరం ,తలనొప్పి , అలసట, వికారం, శరీర నొప్పి మరియు  తలనొప్పి వంటి వాటితో బాధ పడవచ్చు. కానీ కొంతమందిలో ఇలాంటి ప్రభావాలను ఎదుర్కోవడం లేదు  అని చెబుతున్నారు. కానీ మరికొంతమంది విపరీతమైన రకరకాల దుష్ప్రభావాలను ఎదుర్కోవడం జరుగుతుంది. అయితే ఇలా ఎందుకు జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం..


సాధారణంగా కొవిడ్-19 మొదటి డోస్ వేసుకున్న తర్వాత సాధారణ దుష్ప్రభావాలు కలగడం  సహజం అవి తాత్కాలికమైనవి. అందులోనూ రోగనిరోధకశక్తి పుంజుకోవడంతో పాటు శరీర రక్షణ కూడా పెంచుకుంటుంది అని సంకేతాలు ఇవ్వడానికి మనకు టీకా ప్రతిస్పందన ఇస్తుంది. అయితే అందరి శరీరతత్వం ఒకేలా ఉండదు కొందరిలో వేసిన తర్వాత కూడా ఎలాంటి ప్రతిస్పందన చూపించలేదు. అయితే అలాంటి వారికి టీక పనిచేయడం లేదని అర్థమా అంటే అదీ కాదు.  మొదటి డోస్ తో పోలిస్తే రెండవ డోస్ చేయించుకున్నప్పుడు మాత్రమే ప్రజలు మరింత తీవ్రమైన ప్రతిస్పందనలకి గురవుతున్నారు. అంటే కొందరిలో మొదటి డోస్ కే తీవ్రమైన నొప్పులు, జ్వరం వస్తుంటే, మరికొంతమందికి రెండవ డోస్ పూర్తయిన తర్వాతనే ఇలాంటి దుష్ప్రభావాలు కలుగుతున్నాయి.


సాధారణంగా మన శరీరానికి కొవిడ్  వ్యాక్సిన్ వేయించుకుప్పుడు రోగనిరోధక వ్యవస్థ ప్రతిస్పందించడానికి, అలాగే టీకాకు ప్రత్యేకమైన ప్రతిరోధకాలు ఉత్పత్తి చేయడానికి,  కొంత సమయం పడుతుంది. ఇక ఈ సమయంలోనే వ్యక్తి అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంటుంది. ఇక వ్యాధి కారక ఆంటీజన్ లు ప్రతిస్పందనగా ఉత్పత్తి అయ్యి, మనలో లో వ్యాధినిరోధక శక్తి పెంపొందుతుంది.


ఇక సాధారణంగా కోవిడ్ వ్యాక్సిన్ యొక్క సాధారణమైన సైడ్ ఎఫెక్ట్స్ ఏమిటంటే, అలసట, తలనొప్పి , జ్వరం, చలి , వికారం ఇతర దుష్ప్రభావాలను మనం చూడవచ్చు. అప్పుడే మనలో రోగనిరోధక వ్యవస్థ  పెరుగుతోందని అర్ధం.  ఇక కొన్నిసార్లు చేయి , కండరాలు వాపులు రావడం సహజం. అయితే ఇందుకోసం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఒక్కొక్క శరీరతత్వానికి వ్యాక్సిన్ ఒక్కోరకంగా పనిచేస్తుంది. కాబట్టి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. టీకా వేయించుకున్న తరువాత దుష్ప్రభావాలు కలిగినా, కలగకున్నా  మనలో రోగనిరోధక శక్తి పెరుగుతుందనేది మాత్రం నిజం.  కొంతమందిలో మొదటి అంటే రెండో తోనే ఎక్కువగా ఇబ్బంది పడే అవకాశాలు కూడా ఉన్నాయని అని తెలిపారు డబ్ల్యూహెచ్వో సంస్థ వారు.

మరింత సమాచారం తెలుసుకోండి: