సాధారణంగా పాములు పగబడతాయని అందరూ ఒక అపోహ పెట్టుకుంటారు. కాని ఇక్కడ జరిగింది చూస్తుంటే నిజమే కాబోలు అనిపిస్తుంది.ఇక పాములు అక్కడ రెచ్చిపోయాయి. కేవలం 24 గంటల వ్యవధిలోనే అక్కడ పాములు ఐదుగురిన పొట్టనబెట్టుకున్నాయి. ఇక ఉత్తరప్రదేశ్‌లోని బలియా జిల్లాలోని వివిధ పాముకాటు ఘటనల్లో ఒకేసారి ఐదుగురు మృతి చెందగా..వీళ్లలో ఆరేళ్ల చిన్నారి కూడా ఉంది.ఈ మృతుల్లో కూడా ఎక్కువగా యుక్త వయసు వారే ఉన్నారు. ఈ మృతుల్లో 22, 28, 14, 18 ఏళ్ల వయసు గలవారు కూడా ఉన్నారు.ఇక ఈ పాము కాటుతో తమ కుటుంబ సభ్యులను కోల్పోయిన బాధిత కుటుంబాలు కన్నీరుమున్నీరుగా విలపించి ఎంతో బాధ పడ్డారు. ఇక పాము కాటుకు సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మందులు లేకపోవడం అనేది కూడా అక్కడ మృతుల సంఖ్య అనేది పెరగటానికి ఒక కారణంగా తెలుస్తోంది.ఇక 24 గంటల వ్యవధిలోనే ఒకే జిల్లాలో ఐదుగురు వ్యక్తులు పాముకాటుతో మృతి చెందడం యూపీ వ్యాప్తంగానూ ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది.

ఇక ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగానూ గత కొన్ని రోజులుగా భారీ సంఖ్యలో పాముకాటు ఘటనలు జరిగాయి.అక్కడ ప్రతిరోజూ కూడా పదుల సంఖ్యలో జనం పాముకాటుతో మృతి చెందారు. ఇక ఇటీవల కురుస్తున్న వర్షాలకు చాలా పాములు బయటకు వస్తున్నాయి.ఇక మారుమూల ప్రాంతాల్లో పాము కాటు ఘటనలు చోటుచేసుకోవడంతో సకాలంలో వారికి వైద్య చికిత్స అనేది కల్పించలేకపోతున్నారు. పాము కాటుకి చికిత్స ఆలస్యం కావడంతో బాధితులు చాలా ఎక్కువగా మృతి చెందుతున్నారు. ఇక వర్షాల నేపథ్యంలో పాము కాట్ల నివారణ పట్ల ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలని అక్కడి అధికారులు ఆ జిల్లా ప్రజలను సూచించడం జరిగింది.ఇక అటు గ్రామీణ ప్రాంతాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పాము కాటుకు అవసరమైన మందులను అందుబాటులో ఉంచడం జరిగింది. ఇక మిగిలిన జిల్లాల్లోనూ ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలను  పాము కాటు చికిత్స పట్ల చాలా అప్రమత్తం చేయడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: