మహిళలకు  జుట్టు ఉంటేనే అందం. అలాగే ఆడవాళ్ళ అందం విషయంలో జుట్టుకు కూడా ఎంతో  ప్రాధాన్యత ఉంది. కానీ ఉరుకుల పరుగుల జీవితంలో చాలా మంది జుట్టు విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం లేదు.ఇప్పుడు చాలామంది షాంపూ, కండీషనర్ ఉపయోగిస్తున్నారు.ఎన్ని షాంపూలు ఉపయోగించిన కానీ జుట్టు సమస్యలు తగ్గుముఖం పట్టడం లేదు. అందుకని మన పూర్వీకులు ఉపయోగించే కొన్ని ఆయుర్వేద హెయిర్ మాస్క్‌లను అనుసరించండి. మీ జుట్టు ను కాపాడుకోండి. బయట దొరికే షాంపులలో రసాయనాలు కలుస్తాయి. ఫలితంగా షాంపూ వాడడం వల్ల జుట్టు పల్చబడటం, తరచుగా తలలో చుండ్రు, పేలు, చిన్న వయస్సులోనే తెల్ల జుట్టు వంటి సమస్యలకు దారితీస్తుంది. కాబట్టి మీరు సహజ ఆయుర్వేద పద్ధతిని అనుసరించవచ్చు.ఆ పద్ధతులు ఏంటో చూద్దాం.. !!




గూస్బెర్రీ,  జాజికాయ రెండూ కూడా మీ తల నుండి చుండ్రును తొలగించగల సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. ఇది చుండ్రును తొలగించడమే కాక, తల మీద ఉన్న ధూళిని తొలగించి తల శుభ్రంగా ఉంచడానికి సహాయపడుతుంది. గూస్బెర్రీ మీ జుట్టును తేమగా ఉంచుతుంది, జుట్టు కుదుళ్లను బలపరుస్తుంది.ఇక దీనిని ఇలా తయారుచేయాలంటే.. 1 కప్పు గూస్బెర్రీ పౌడర్,  2 కప్పుల జాజికాయ పొడిని నీటిలో కలిపి తలపై  మసాజ్ చేసి, ఒక గంట నుండి రెండు గంటలు పాటు అలాగే ఉంచి తరువాత శుభ్రం చేసుకోవాలి. ఇలా చేస్తే జుట్టు సమస్యలు తగ్గుముఖం పడతాయి.




అలాగే మరొక పద్ధతి ఏంటంటే  ఒక కప్పు మెంతులు పొడి తీసుకోండి. ఒక కప్పు గూస్బెర్రీ పౌడర్ కూడా తీసుకోండి. రెండింటినీ కలిపి రాత్రిపూట నీటిలో నానబెట్టండి. మరుసటి రోజు ఉదయాన్నే లేచి ఆ మిశ్రమాన్ని తీసుకొని తలపై రుద్దండి. అలాగే అరగంట పాటు తలకి పట్టించి వదిలేయండి.
అలాగే వేపలో యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంది. మీ తలపై బొబ్బలు ఉంటే ఇది పోరాడుతుంది. ఇది బొబ్బలకు వ్యతిరేకంగా పోరాడటమే కాకుండా చుండ్రును తొలగిస్తుంది. కొన్ని వేప ఆకులను తీసుకొని రాత్రిపూట నీటిలో నానబెట్టండి. మరుసటి రోజు ఉదయం ఆకులను తీసుకొని నాలుగు టేబుల్ స్పూన్ల గూస్బెర్రీ పౌడర్ తో రుబ్బుకొని తలమీద అలాగే వెంట్రుకల మీద రుద్ది ఒక అరగంట పాటు వదిలివేయండి.గూస్బెర్రీలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది మీ జుట్టు పెరుగుదలను పెంచడంలో సహాయపడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: