కరోనా వైరస్ ప్రభావంతో అన్ని పరిశ్రమలు తీవ్ర నష్టాలను ఎదురుకుంటున్నాయని చెప్పవచ్చు. ఇందులో ఆటో రంగం చాలా దెబ్బతింటుందని చెప్పవచ్చు. దీనికి కారణం లాక్ డౌన్ తో అన్ని రకాల విక్రయాలను ఆపివేయడం. దీనితో ఆటోమొబైల్ రంగం సంబంధించి కంపెనీలు తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నాయి. దీనితో చాలా వాహనాల విడుదలను వాయిదా వేశారు ఈ కంపెనీలు. 

 


అందులో కూడా బి ఎస్ 6 డేట్ లైన్ కారణంగా విక్రయాలు అడుగంటాయి. అయితే కొన్ని ఆటో సంస్థలు సైలెంట్ గా తమ వాహనాలను భారత మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి. ఈ విషయంలో ప్రముఖ ద్విచక్ర వాహన సంస్థ బజాజ్ తన ప్లాటినా 110 H గేర్ బైక్ ను బి ఎస్ 6 ప్రమాణాలకు అనుగుణంగా మార్పులు చేసి భారత్ లోకి వదిలేసింది. అయితే ఈ మోటార్ సైకిల్ ప్రస్తుతానికి సింగిల్ డిస్క్ వేరియంట్ లోనే అందుబాటులో ఉంది.

 


ఇక ఈ బైక్ ధర విషయానికి వస్తే ఇందులో ప్రారంభ ధర వచ్చి రూ. 59,802 లు లు నిర్దేశించగా, ఇది బి ఎస్ 4 మోడల్ తో పోలిస్తే ఇది ఏకంగా రూ. 3431 ఎక్కువగా ఉంది. అయితే ఈ మోడల్ మాదిరి బి ఎస్ 6 ప్లాటినా బైక్ డిస్క్ వేరియంట్ కూడా రెండు రంగులలో అందుబాటులోకి వచ్చింది. అందులో నలుపు, ఎరుపు రంగుల్లో ఈ మోటార్ సైకిల్ ని అందుబాటులోకి తెచ్చారు కంపెనీ.
ఇక ఈ బైక్ విశేషాల్లోకి వస్తే బిఎస్ 6 ప్లాటినా మోటార్ సైకిల్ డిజైన్ లో ఎటువంటి పెద్దగా మార్పు లేదు. ఇంతకుముందు మోడల్ మాదిరి సేమ్ డిజైన్తో అందుబాటులోకి వచ్చింది. ఫీచర్లు కూడా పెద్దగా ఏమీ మార్పులు లేవని అనిపిస్తోంది. అయితే ఈ విషయాల్లో కొన్ని విషయాలు మాత్రమే అప్డేట్ ని చేశారు. ఇక సస్పెన్షన్ సెటప్ విషయానికి వస్తే ముందు భాగంలో కన్వెన్షనల్ టెలిస్కోపిక్ ఫోర్క్ అలాగే వెనుకభాగంలో నైట్రక్స్ ఛార్జడ్ ట్విన్ స్ప్రింగ్ షాక్అబ్జార్బర్లు చార్జర్ స్ప్రింగ్ ఇందులో పొందు పరిచారు.

మరింత సమాచారం తెలుసుకోండి: