హుజూరాబాద్ ఉప ఎన్నికల నేపధ్యంలో మంత్రి హరీష్ రావు వర్సెస్ మాజీ మంత్రి ఈటెల రాజేందర్ వేదికగా రాజకీయం నడుస్తుంది. హరీష్ రావు రబ్బర్ స్టాంప్ అని ఆరోపించారు ఈటెల రాజేందర్ . నేను సీఎం కావాలని అనుకున్నానా అంటూ... గుండె మీద చెయ్యి వేసి చెప్పు హరీష్ రావుని నిలదీశారు. అడుగులకు మడుగులు ఒత్తితేనే ప్రగతి భవన్ కు ఎంట్రీ అన్నారు ఆయన.

నేను రాజీనామా చేయలేదు తెలంగాణ భవన్ లో ప్రెస్ మీట్ పెట్టి రాజీనామా చెయ్యిమంటేనే చేశాను అని ఆయన పేర్కొన్నారు.  హరీష్ రావు లాగా వారసత్వం తో రాజకీయాల్లోకి రాలేదు అని స్పష్టం చేసారు. హరీష్ కు ఆయన  మామ ఉన్నాడు అన్నారు. హుజురాబాద్ ఎన్నిక రిహార్సల్ మాత్రమే అని ఆయన పేర్కొన్నారు. ఇక హుజూరాబాద్ లో కచ్చితంగా గెలుస్తామని హరీష్ రావు ధీమా వ్యక్తం చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: