ఏపీ శాస‌న స‌భ‌లో కులాలవారీగా బీసీ జనగణనను ఏక‌గ్రీవంగా తీర్మాణం చేసి కేంద్ర ప్ర‌భుత్వానికి పంపుతున్నామ‌ని వెల్ల‌డించారు ముఖ్య‌మంత్రి  జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి. కేంద్ర ప్ర‌భుత్వం ప‌రిగ‌ణ‌లోకి తీసుకొని వారి భాష‌లో ఓబీసీలు జ‌న‌గ‌ణ‌న చేయాల‌ని, శాస‌న‌స‌భ‌లో తీర్మాణం చేసి కోరుతున్నాం. గ‌త ప్ర‌భుత్వాలు చేశామంటే.. చేశాం.. ఇచ్చామంటే ఇచ్చాం అన్న ధోర‌ణి వ్య‌వ‌హ‌రించాయ‌ని పేర్కొన్నారు. అర్హులంద‌రికీ  సంక్షేమం అభివృద్ధి వ‌ర్తింప‌జేయడం వంటి  ఆలోచ‌న కూడా చేయ‌లేదని,  గ‌త ప్ర‌భుత్వ పాల‌న‌లో బీసీల‌ను విభ‌జించార‌ని గుర్తు చేసారు.

 బీసీలు అంటే బాక్ వ‌ర్డ్ క్లాస్ కాదు.. బాక్‌ బోన్ క్లాస్ అని గ‌తంలోనే చెప్పాం. ఇప్ప‌డు కూడా గుర్తు చేస్తున్నామ‌ని సీఎం పేర్కొన్నారు.  బీసీలంద‌రూ మ‌న వాళ్లే.. ఓటు వేసినా.. వేయ‌క‌పోయినా.. అర్హులంద‌రికీ వైఎస్సార్ పెన్ష‌న్‌, రైతుభ‌రోసా, ఉచిత పంట‌ల బీమా, ఇన్‌పుట్ స‌బ్సీడి, వైఎస్సార్ చేయూత‌, వైఎస్సార్ ఆసరా.., జ‌గ‌న‌న్న అమ్మఒడి, విద్యాదీవెన‌, వైఎస్సార్ నేత‌న్న నేస్తం, జ‌గ‌న‌న్న తోడు, జ‌గ‌నన్న చేదోడు,  వైఎస్సార్ వాహ‌న మిత్ర‌, బీమా వంటి ప‌థ‌కాలు ఏది తీసుకున్నా జ‌గ‌న‌న్న ఇండ్ల ప‌ట్టాలు కూడా 31 ల‌క్ష‌లు ఇచ్చాం. ఎక్క‌డ కూడా లంచాలు లేవని, అర్హ‌త ఉంటే చాలు వివ‌క్ష‌త‌కు తావు లేకుండా ప్ర‌తి ఒక్క‌రికీ మంచి చేయ‌డం జ‌రిగింది. సామాజిక న్యాయం క‌న‌ప‌డేలా 32 ఎమ్మెల్సీ సీట్ల‌కు ఎస్సీ, ఎస్టీ, బీసీల‌కు సంబంధించిన‌వి 18 సీట్లు.. రాజ్య‌స‌భ‌కు పంపిన న‌లుగురిలో ఇద్ద‌రు బీసీలు ఉన్నార‌ని గుర్తు చేసారు. గ‌త ప్ర‌భుత్వ హ‌యాంలో రాజ్య‌స‌భ‌కు ఒక్క బీసీని పంపించిన దాఖ‌లాలు లేవ‌ని పేర్కొన్నారు. తొలిసారి మండ‌లిలో ద‌ళితుల‌కు ఇవ్వ‌గ‌లిగామ‌ని చెప్పారు.




మరింత సమాచారం తెలుసుకోండి: