అసెంబ్లీలో మండ‌లి ర‌ద్దు తీర్మాణాన్ని ఆర్థిక మంత్రి బుగ్గ‌న ప్ర‌వేశ‌పెట్టారు. శాస‌న మండ‌లి ఏర్పాటు చేయాల‌న్న.. ర‌ద్దు చేయాల‌న్న కేంద్ర ప్ర‌భుత్వం ఆధీనంలోనే ఉంటుంది. శాస‌న మండ‌లి ర‌ద్దును వెన‌క్కి తీసుకుంటూ ఏపీ ప్ర‌భుత్వం తీర్మాణం చేసింది. మండ‌లి ర‌ద్దు త‌రువాత ఒక సందిగ్ద‌త ఏర్ప‌డింది. సందిగ్ద‌త‌ను కొన‌సాగించాల‌ని సీఎం జ‌గ‌న్ నిర్ణ‌యించారని మంత్రి బుగ్గ‌న పేర్కొన్నారు.

  దాదాపు  22 నెల‌లుగా కేంద్రం వ‌ద్దే తీర్మాణం ఉండిన‌ది. గ‌త ఏడాది జ‌న‌వ‌రి 27న మండ‌లి ర‌ద్దు తీర్మానాన్ని అసెంబ్లీలో ప్ర‌వేశ‌పెట్టి తీర్మానించారు. కేంద్రం నిర్ణ‌యం రాక‌పోవ‌డంతో మండ‌లి ర‌ద్దు తీర్మాన‌మును ఉప‌సంహ‌రించుకున్న‌ట్టు ఇవాళ ప్ర‌క‌టించారు. 22 నెల‌ల పాటు కేంద్రం వ‌ద్దే ఉండిపోయింది తీర్మానం. శాస‌న‌మండ‌లిలో టీడీపీ 12, వైసీపీ ప్ర‌స్తుతం 18 ఉన్నారు. కొద్ది రోజుల్లోనే వైసీపీకి 32 వ‌ర‌కు చేరుకునే అవ‌కాశం క‌నిపిస్తుంది. మూడు రాజ‌ధానుల‌కు సంబంధించిన బిల్లులు పంపించిన‌ప్పుడు కేంద్రం శాస‌న మండ‌లి ర‌ద్దు తీర్మానంను పెండింగ్‌లో పెట్టింది. దీంతో ఇవాళ ర‌ద్దు చేస్తున్న‌ట్టు అసెంబ్లీలో  తీర్మానించారు.




మరింత సమాచారం తెలుసుకోండి: