ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి నివారణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. ఇప్పటికే సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. అయితే.. సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయం, ఎమ్మార్వో, ఎండీఓ, ఆర్డీఓ, కలెక్టర్‌ కార్యాలయాలతో పాటు అవినీతి జరగడానికి అవకాశం ఉన్న అన్ని ప్రభుత్వ కార్యాలయాలపై మరింత దృష్టి పెట్టాలని సీఎం జగన్ అధికారులకు సూచించారు.


అందుకే ప్రతి ప్రభుత్వ కార్యాలయాలు, ఆస్పత్రుల్లో  స్పష్టంగా కనిపించేలా ఏసీబీ ఫిర్యాదు నెంబర్ 14400 పోస్టర్‌లు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి జగన్ అధికారులను ఆదేశించారు.పటిష్టమైన చర్యలు ద్వారానే అవినీతిని రూపుమాపగలుగుతామని సీఎం జగన్ అన్నారు. 14400 ఫోన్‌ కాల్స్‌ను తీసుకోవవడంతోపాటు వాటికి సంబంధించిన యాక్షన్‌ టేకెన్‌ రిపోర్టుపైనా  పక్కాగా ఉండాలని సీఎం జగన్ ఆదేశించారు. వీలైనంత వరకూ రెవెన్యూ, సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలు సహా అవినీతి జరిగేందుకు అవకాశం ఉన్న అన్ని కార్యాలయాలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని సీఎం జగన్ ఆదేశించారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

acb