
బిట్ కాయిన్ అయినా, ఎథెరియం , ఎన్ఎఫ్‌టీ వంటి వాటిని ఎప్పటికీ లీగల్ టెండర్ గా ప్రకటించబోమని స్పష్టం చేసారు. క్రిప్టో ఆస్తి అనేది ఇద్దరు వ్యక్తుల మధ్య ధర లేదా విలువ నిర్ణయించబడే ఆస్తి అని పేర్కొన్నారు. బంగారం, వజ్రం లాంటివి కొనుగోలు చేసినా ప్రభుత్వం వాటి ధరలకు హామీ ఇవ్వదని చెప్పారు. ముఖ్యంగా పెట్టుబడికి పూర్తిగా సురక్షితమైన సొంత డిజిటల్ కరెన్సీ లేదా డిజిటల్ కరెన్సీని ప్రభుత్వం తీసుకురానున్నట్టు వెల్లడించారు. ఫిబ్రవరి 01న విడుదల చేసిన సాధారణ బడ్జెట్‌లో రిజర్వ్ బ్యాంకు డిజిటల్ కరెన్సీని జారీ చేయడంపై జరిగిన చర్చ గురించి వివరించారు.
ముఖ్యంగా రిజర్వ్ బ్యాంకు ప్రవేశపెట్టిన డిజిటల్ కరెన్సీ ఎప్పటికీ డిఫాల్ట్ కాదు అని ఆర్థిక కార్యదర్శి సోమనాథన్ స్పష్టం చేసారు. డిజిటల్ రూపాయి డబ్బు ఆర్‌బీఐకి చెందినది, దాని రూపం పూర్తిగా డిజిటల్‌గా ఉంటుంది. ఏదైనా క్రిప్టో ఆస్తి లేదా క్రిప్టో కరెన్సీ అని చెల్లుబాటు కావు భవిష్యత్‌లో కూడా చెల్లబాటయ్యేవి కావు అని క్లారిటీ ఇచ్చారు. క్రిప్టో కరెన్సీపై ప్రతి ఒక్కరూ 30 శాతం చొప్పున పన్ను చెల్లించాల్సి ఉంటుందని, ఈ నియమం క్రిప్టోకు మాత్రమే కాదు, ఊహజనిత ఆదాయానికి వర్తిస్తాయని స్పష్టం చేసింది. ఊహజనిత లావాదేవీలపై ఇప్పటికే 30 శాతం పన్ను విధిస్తున్నారని.. క్రిప్టోపై కూడా 30 శాతం పన్ను నిబంధనను తీసుకొచ్చినట్టు ఆర్థిక కార్యదర్శి వెల్లడించారు.