తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో మంది డైరెక్టర్లు ఉన్నప్పటికీ త్రివిక్రమ్ స్టైల్ వేరు అన్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటివరకూ త్రివిక్రమ్ కెరీర్ లో ఎన్నో హిట్ సినిమాలను తెరకెక్కించారు. ఎన్నో అద్భుతమైన విజయాలను సొంతం చేసుకున్నారు. అయితే త్రివిక్రమ్ సరిగ్గా ఇదే రోజున 21 సంవత్సరాల క్రితం తన సినీ కెరీర్ ను ప్రారంభించారు. మాటల మాంత్రికుడు మ్యాజిక్ ప్రారంభమైంది ఈ రోజే . సరిగ్గా 21 సంవత్సరాల క్రితం... స్వయంవరం అనే సినిమాతో 1999 మార్చి 22వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చాడు త్రివిక్రమ్. సినీ పరిశ్రమకు ఎంతో ఇచ్చి 21 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా త్రివిక్రమ్ ఫాన్స్ శుభాకాంక్షలు తెలుపుతున్నారు.ఈ సందర్భంగా ట్విట్టర్ వేదికగా త్రివిక్రమ్ కు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. 21 సంవత్సరాల నుంచి తెలుగు చిత్ర పరిశ్రమలో మకుటం లేని మహారాజుగా ఎంతో మంది ప్రేక్షకులను వినోదభరితంగా తన గీతాలతో పాత్రలతో తన చిత్రాలతో జ్ఞానోదయం చేసిన తమ ప్రియతమ దర్శకుడు త్రివిక్రమ్ ఇంకెన్నో రోజుల పాటు తన చలన చిత్రాల తో జ్ఞానోదయం చేస్తాడు అని ఆశిస్తున్నాము అంటూ త్రివిక్రమ్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా త్రివిక్రమ్ కు శుభాకాంక్షలు తెలిపారు.
It All Started This Day 21 Years Back, swayamvaram Released 22.04.1999 .. Our Best Wishes To Guruvugaru #Trivikram ..
— Trivikram_Fans (@Trivikram_Fans) April 22, 2020
💐💐💐
Hope He Keeps Entertaining, Enlightening With His Lines, Characters, Films For Many Years To Come .. #21YearsOfTrivikram pic.twitter.com/mmiZq3nkLj